Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కలకలం. చిట్టాపూర్ శివార్లలో కారు కలకలం రేపింది. ఏం జరిగిందో ఏమో. నేల బావిలో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కలకలం. చిట్టాపూర్ శివార్లలో కారు కలకలం రేపింది. ఏం జరిగిందో ఏమో. నేల బావిలో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. జెట్ స్పీడ్‌తో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. బావిలో నుంచి కారును బయటికి తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌ను చూస్తుంటే, కారు అదుపుతప్పి రోడ్డు పైనుంచి కిందకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. బావి బయట కారు సైలెన్సర్, కారు చక్రం పార్ట్స్ ఉంటే, కారు టైరు ఒకటి నీటిలో తేలియాడుతూ కనిపిస్తోంది. ఈ వ్యవసాయ బావిలో నీరు నిండుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగి పోయింది. అంతేకాకుండా ఈ వ్యవసాయ బావికి ఎలాంటి అడ్డు గోడలు నిర్మించక పోవడం ఈ ప్రమాదం జరగడానికి కారణంగా తెలుస్తోంది. చుట్టు చెట్లు ఉండటంతోపాటు.. ప్రధాన రహదారికి సమీపంలో ఈ వ్యవసాయ బావి ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? ఇందులో ఎంత మంది ఉండి ఉంటారు..? వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు..? ఈ రోడ్డులో ఎటువైపు వెళ్తున్నారు..? ప్రమాదం జరగడానికి గల కారణాలు..? కారు బావి నుంచి బయటకు వస్తే కాని ఇలాంటి ప్రశ్నలు లభించే అవకాశం లేదు.
అయితే.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పాట్‌ని పరిశీలించారు. పోలీసులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్స్‌ను పర్యవేక్షించారు. మోటార్లతో బావిలో నీటికి బయటికి తోడుతున్నారు. అసలు, కారులో ఎంతమంది ఉన్నారు. ఎవరు ఉన్నారనేది దాన్ని బయటికి తీస్తేనే క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి: Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..