AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..

చలికాలంలో వేడి వేడి టీ తాగడానికి ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ఎక్కువ మంది షుగర్ టీ కంటే.. బెల్లం టీ తాగడానికి ఇష్టపడతారు. షుగర్ కంటే బెల్లం..

Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా..  అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..
Jaggery Tea
Sanjay Kasula
|

Updated on: Dec 01, 2021 | 4:11 PM

Share

చలికాలంలో వేడి వేడి టీ తాగడానికి ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ఎక్కువ మంది షుగర్ టీ కంటే.. బెల్లం టీ తాగడానికి ఇష్టపడతారు. షుగర్ కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. కొందరు నిత్యం ఒకటి రెండు టీలంటే ఎక్కువ సార్లు టీ తాగుతుంటారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే.. మీరు చలి కాలంలో అధికంగా బెల్లం టీ తాగితే.. అది మీకు చాలా హానికరంగా మారుతుంది. బెల్లం రుచి వేడిగా ఉంటుంది. దానివల్ల అధికంగా తీసుకోవడం వల్ల ముక్కు నుండి రక్తస్రావం సమస్య వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. బెల్లం టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం.

బెల్లం టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు  వస్తాయి..

జీర్ణక్రియ అధ్వాన్నంగా మారుతుంది 

మీరు రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ బెల్లం టీని తీసుకున్నట్లైతే అది ఎసిడిటీకి కారణంగా మారుతుంది. అలాగే టీలో కొత్త బెల్లం వాడితే పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది.

ముక్కు రక్తస్రావం సమస్య

బెల్లం టీ ఎక్కువగా తాగడం (రోజుకు నాలుగు టీలను మించి..) వల్ల ముక్కు నుండి రక్తం కారుతుంది. ఎందుకంటే మీ శరీరంలో ఉష్ణం పెరిగిపోతుంది.

బరువు పెరగవచ్చు 

బెల్లంలో కలరా అధిక పరిమాణంలో కనిపిస్తుంది. అందువల్ల మీరు ఈ టీని రోజుకు చాలాసార్లు తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

అధిక రక్త చక్కెర ప్రమాదం 

10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువల్ల బెల్లం టీని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.  చల్లని వాతావరణంలో 2-3 కప్పుల కంటే ఎక్కువ టీ తాగకుండా ప్రయత్నించండి. బెల్లం టీ తాగిన తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించి దానికి దూరంగా ఉండండి.

సూచన: వీటిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.  

ఇవి కూడా చదవండి: Sirivennela Sitarama Sastri: ఆయనో జాతీయ సాహితీ శిఖరం.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి..

Sirivennela Sitarama Sastri: అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..! అంటూ ప్రశ్నించిన సాహితీధీరుడికి 11 నందులు..