AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela Sitarama Sastri: ఆయనో జాతీయ సాహితీ శిఖరం.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి..

సిరివెన్నెల సీతారామశాస్త్రితో తమకున్న అనుబంధాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు నుంచే ఆరెస్సెస్‌తో సాన్నిహిత్యం ఉన్న కుటుంబం వారిది అని గుర్తు చేసుకున్నారు. 

Sirivennela Sitarama Sastri: ఆయనో జాతీయ సాహితీ శిఖరం.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి..
Rss Sirivennela
Sanjay Kasula
|

Updated on: Nov 30, 2021 | 9:51 PM

Share

Sirivennela – Kishan Reddy: తెలుగు గేయ సాహిత్యాన్ని శిఖరాగ్రానికి చేర్చిన వెన్నల రేడు ఇక లేడన్న నిజం ప్రతి తెలుగు హృదయాన్నీ కన్నీరొలికించింది. ప్రతి గుండెనూ కదిలించింది. సిరివెన్నలతో తెలుగు సినీ సాహితీ గగనాన మెరిసి మురిసిన ఒక కవికిరణం తెలుగు ప్రజల మదిలో సుచిరస్థానాన్ని ఆక్రమించింది. పాటని పరవళ్ళు తొక్కించి, పాటనే తన పేరుగా నిలుపుకున్న ఏకైక కవికేతనం సిరివెన్నల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని విని తరించని తెలుగు బిడ్డడు, జాతీయవాదిగా ఉండడంటే అతిశయోక్తి కాదు. సరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని గురించి రాయాలంటే మాటలు చాలవు. పదాలతో ప్రపంచమార్గాన్నే అన్వేషించిన రవిగాంచని చోటుని సైతం కాంచిన కవి అతడు. ఇదే విషయాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్వయంగా ఒప్పుకున్నారు.

ప్రపంచం నీలో ఉన్నదనీ, నీతో ఉన్నదనీ నిజం తెలుసుకోవా? తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే పలకరించుకొని పరవశించిపోవా? రంగులన్నీ నీలో ఉన్న భావాలేనంటూ సృష్టికి ప్రత్యర్థం తెలియజెప్పుతారు సీతారామ శాస్త్రి. సాహిత్యానికే సిరినిచ్చిన సిరివెన్నెల సీతారాముడి కలం నుంచి జాలువారిన గేయాలు అఖిలాంధ్ర ప్రేక్షకులను మరిన్ని శతాబ్దం పాటు అలరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన గేయవస్తువు అంత విశాలమైనదీ, విస్త్రుతమైనదీ. ఆ కవి హృదయం అంతటి లోతైనది. అంతేకాదు జాతీయ భావజాలంతో ముడిపడిన సీతా రామయ్య కలం నుంచి జాలువారిన గేయాలు ఎన్నో.. ఎన్నెన్నో..

ఇటు ప్రేమ కవిత్వాన్నీ, అటు సామాజిక.. జాతీయ చైతన్యాన్నీ నింపి మరో వైపు ఆధ్యాత్మిక అంతరంగలోతుల్నీ శోధించి, సాధించిన సీతారాముడతడు. ఎవరో ఒకరు ఎపుడో అపుడు పాటలోని సాహిత్యం సింపుల్‌గా సామాన్యుడికి అర్థమయ్యేలా సాగుతుంది.

సినిమాల్లోకి రాకముందు నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో..

అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రితో తమకున్న అనుబంధాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన 1985 నుంచి ఆయనతో పరిచయం ఉందన్నారు. సినిమాల్లోకి రాకముందు నుంచే ఆరెస్సెస్‌తో సాన్నిహిత్యం ఉన్న కుటుంబం వారిది అని గుర్తు చేసుకున్నారు. కోస్తా జిల్లాల్లో 1985లో యువమోర్చా సమావేశాలు నిర్వహిస్తే ఆయన కూడా వచ్చేవారని తెలిపారు.

దేశభక్తి పాటలు పాడి పార్టీ నేతలు, కార్యకర్తలకు జాతీయతను నింపేవారని అన్నారు. విజయవాడలో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో స్వాగత సభలో ఆయన పాటపాడిన పాట ప్రతి ఒక్కరిని జాతీయ భావజాలం వైపు కదిలించిందని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత జాతీయ భావజాలంతో ఆయన ఎన్నో రచనలు చేశారు.

అయితే ఇటీవల తాను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలుసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  ఆ సందర్భంలో తాను రచించిన దేశభక్తి పాటల సంకలనం సీడీని అందించారని అన్నారు. ఆయన మరణం కళారంగానికే కాకుండా జాతీయ భావజాలం కల్గిన అనేకమందికి తీరని లోటన్నారు. ఆ లోటు పూడ్చలేనిది. చాలా బాధగా ఉందన్నారు. ఆయన మరణం దురదృష్టకరం అని సినీ రంగంలో దేశభక్తి పాటల రచనలో మహోన్నత స్థానం ఆయనకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

చిన్నప్పటి నుంచీ పాటలు పాడాలనే కోరికే..

1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు.

చిన్నప్పటి నుంచీ పాటలు పాడాలనే కోరికే అయనను సాహిత్యం వైపు నడిపించింది. అప్పట్లో కొన్ని సాహితీ సభల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావడంతో.. సిరివెన్నెల సినిమా నుంచి ఆయన కలం కదలడం మొదలెట్టింది. ఎన్నో అవార్డుల తెచ్చిపెట్టింది. తెలుగు అభిమానులందరి ప్రేమను సొంతం చేసుకున్న ఆ కలం ఇప్పుడు గగనానికి ఎగిసింది.

ఇవి కూడా చదవండి: Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..

Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..