Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

బఠానీలను దేనిలోనైనా కలుపుకుని తినవచ్చు. ముఖ్యంగా శాఖాహారులు తప్పనిసరిగా బఠానీలను తినాలి. అనేక పరిశోధనలలో, పచ్చి బఠానీలు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. చలికాలంలో బఠానీలు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి.

Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
Green Peas Incredible Benef
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 30, 2021 | 2:48 PM

Green peas Incredible Benefits: చలికాలంలో బఠానీలను తినడానికి చిన్న నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. బఠానీలు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని దేనిలోనైనా వేసుకుని తినవచ్చు. ముఖ్యంగా శాఖాహారులు తప్పనిసరిగా బఠానీలను తినాలి. అనేక పరిశోధనలలో పచ్చి బఠానీలు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. చలికాలంలో బఠానీలను తినడం వల్ల శరీరానికి గ్రీన్ పీస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది – పచ్చి బఠానీలలో ప్రోటీన్,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి, దీని వల్ల త్వరగా ఆకలి ఉండదు. వాటిలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీ ఆహారంలో బఠానీలను ఖచ్చితంగా చేర్చుకోండి. మీరు బఠానీలను ఉడకబెట్టడం, కూరగాయలు లేదా సూప్ చేయడం ద్వారా కూడా తీసుకోవచ్చు. అనేక విధాలుగా ఆరోగ్యానికి ప్రోటీన్లు అవసరం. అరకప్పు బఠానీలో 4 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్ మాత్రమే కాదు, బఠానీలలో ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ ఎ, కె , సి కూడా ఉంటాయి. ప్రోటీన్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. కండరాల బలాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా పని చేస్తుంది.

మధుమేహంలో మేలు చేస్తుంది- శనగలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. అందువల్ల, ఇది డయాబెటిస్‌లో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. బఠానీలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, కాబట్టి డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇందులో ఉండే విటమిన్లు మధుమేహం వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది – గ్రీన్ పీస్‌లో ఫైటిక్ యాసిడ్, లెక్టిన్‌లు వంటి యాంటీన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి ఇనుము, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

లెక్టిన్లు కడుపులో గ్యాస్, ఉబ్బరాన్ని కలిగిస్తాయి . బఠానీలు దానిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు మలబద్ధకం సమస్యను దూరం చేసి మల విసర్జనను మెరుగుపరుస్తుంది. గుండెకు ఆరోగ్యకరం- బఠానీల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు గుండెకు మేలు చేస్తాయి. అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులు ఎక్కువ. శనగలు కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి: Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..

Pumpkin Seeds Benefits: డయాబెటిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఈ గింజలు తినండి.. మధుమేహం అదుపులోకి తెచ్చుకోండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!