Winter Diet: నిమ్మరసంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు.. చలికాలంలో తాగితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..
నిమ్మకాయతో ఆరోగ్యానికి బహుళ ప్రయోజనాలున్నాయి. రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు అని అంటారు.
నిమ్మకాయతో ఆరోగ్యానికి బహుళ ప్రయోజనాలున్నాయి. రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు అని అంటారు. అయితే కొన్నిసార్లు నిమ్మకాయ తీసుకోవడం జలుబు సమస్య కలుగుతుందనే అపోహ కూడా లేకపోలేదు. కేవలం నిమ్మకాయలను వేసవిలో మాత్రమే తీసుకోవాలని చలికాలంలో తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటుంటారు. కానీ నిజానికి ఈ మాట సరైనది కాదు. చలికాలంలో నిమ్మకాయ, నిమ్మరసం తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి.
ఇది జ్వరం, వైరల్ ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ . శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి… పొటాషియం కరిగిస్తుంది. చలికాలంలో నిమ్మరసం తీసుకోవడం వలన కాలేయం, మూత్రపిండాలు..గుండెకు సంబంధించిన అన్ని వ్యాధులు తగ్గుతాయి. అలాగే ఇతర వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
చలికాలంలో నిమ్మరసం తీసుకోవడం వలన ప్రయోజనాలు.. 1. చలికాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులను ఇబ్బందిపడుతుంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చలికాలంలో నిమ్మరసం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. 2. చలికాలంలో ఎక్కువగా నీరు తాగాలని ఉండదు. దీంతో ఈ కాలంలో నీరు తక్కువగా తీసుకుంటారు. అందుకే చలికాలంలో నిమ్మరసం తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీటిస్థాయిని అందిస్తుంది. అలాగే తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. 3. ఇక చలికాలంలో చర్మ సమస్యలు తీవ్రంగా వేధిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ కాలంలో మొటిమలు, చర్మ అలెర్జీలు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే నిమ్మరసంలో రక్తాన్ని శుభ్రపరిచి… శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ చలికాలంలో నిమ్మరసం రోజూ తీసుకోవడం మంచిది.
Nani: ముందే నాకు చెప్పాలనుకున్నారు.. కానీ మిస్ అయ్యి బాధపడ్డాను.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు..