AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela Sitarama Sastri: అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..! అంటూ ప్రశ్నించిన సాహితీధీరుడికి 11 నందులు..

తెలుగు సినీ లోకంలో సాహితీ సిరులు పండించిన సిరివెన్నెల కరిగిపోయింది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న ఆ సాహితీధీరుడు అకాల మ‌ర‌ణంతో అందరినీ విషాదంలోని నెట్టేశాడు. ఇండస్ట్రీలో అడుగుపెడుతూనే అవార్డులు..

Sirivennela Sitarama Sastri: అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..! అంటూ ప్రశ్నించిన సాహితీధీరుడికి 11 నందులు..
Telugu Film Lyricist Sirive
Sanjay Kasula
|

Updated on: Nov 30, 2021 | 8:25 PM

Share

తెలుగు సినీ లోకంలో సాహితీ సిరులు పండించిన సిరివెన్నెల కరిగిపోయింది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న ఆ సాహితీధీరుడు అకాల మ‌ర‌ణంతో అందరినీ విషాదంలోని నెట్టేశాడు. ఇండస్ట్రీలో అడుగుపెడుతూనే అవార్డులు సొంతం చేసుకున్న కలం యోధుడు. కవిత్వానికి ఒంపులు అక్షరంలో అందాలు గుర్తించిన ఆయనకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఉత్తమ గీత రచయితగా 11సార్లు నంది అవార్డు అందుకున్నారు. సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట విధాత తలపున.. దీంతో అవార్డులు అందుకోవడం ఆయనకు మొదలైంది. . సిరివెన్నెల సినిమాలోని పాటకు ఉత్తమ గీత రచయితగా తొలి నంది అవార్డు అందుకున్నారు.

విశ్వనాథ్‌ దర్శకత్వంలోనే శ్రుతిలయలు సినిమాలో ఆయన రాసిన తెలవారదేమో స్వామి అంటూ సాగే పాటకు రెండో నందిని సొంతం చేసుకున్నారు. కె.వి.మహదేవన్‌ ట్యూన్‌ ఇవ్వగా సీతారామశాస్త్రి సాహిత్యంతో ఈ పాటల ప్రేక్షకులకు అలరారించింది.

ముచ్చటగా మూడోసారి కూడా విశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన సినిమాలోని పాటకే నందిఅవార్డు సీతారామశాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన స్వర్ణకమలంలో అందెల రవమిది పదములదా అంటూ సాగే పాట ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధులను చేసింది. ఆయనకు అవార్డు తెచ్చిపెట్టింది.

ఇక రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాలో కీలక పాత్ర పోషించిన సిరివెన్నెల సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని అంటూ సాగే పాట అందించారు.

కృష్ణా రెడ్డి దర్శకంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో ఐదో నంది అవార్డు అందుకున్నారు. చిలుక ఏ తోడు లేక అంటూ సాగే పాట ప్రేక్షకులకు కట్టిపడేసింది.

ఆరోసారి అవార్డు నంది అవార్డు మనసు కాస్త కలత పడితే అంటూ సాగిన శ్రీకారం సినిమాకు వరించింది.

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా? అంటూ ఆయన వేసిన ప్రశ్నకు ఏడోసారి అవార్డు దక్కింది. అటు పోలీసు.. ఇటు తీవ్రవాదులను.. సమాజాన్ని ప్రశ్నిస్తే సంధించిన బాణం అది. ఒక్క పాటలో సమాజాన్ని చూపించారు.

అక్కినేని మనవడు.. సుమంత్‌ను పరిచయం చేస్తూ రాంగోపాల్‌ వర్మ తీసిన ప్రేమకథ సినిమాలో దేవుడు కరుణిస్తాడని అంటూ సాగిన పాటకు మరోసారి అవార్డు అందుకున్నారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సినిమా చక్రం. మనిషి జీవితాన్ని కొత్తగా చూపించిన ఈ సినిమాలో ఆయన రాసిన జగమంత కుటుంబం నాది పాటకు 9వసారి నంది అవార్డు దక్కింది.

పదోసారి నంది అవార్డు గమ్యం సినిమాతో సొంతం చేసుకున్నారు. ఎంత వరకూ ఎందుకొరకు అంటూ సాగిన పాటను వరించింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మరీ అంతగా అంటూ సాగిన పాటకు 11వ సారి నంది అందుకున్నారు సిరివెన్నెల.

ఇవి కూడా చదవండి: Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..

Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..