Walking Calories: నడకతో ఎలాంటి ఉపయోగాలున్నాయి..? వాకింగ్ వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..?

Walking Calories: ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నకడ ఎంతో మంచిది. వాకింగ్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇప్పటికే వాకింగ్‌ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయో..

Walking Calories: నడకతో ఎలాంటి ఉపయోగాలున్నాయి..? వాకింగ్ వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..?
Walking
Follow us
Subhash Goud

|

Updated on: Dec 01, 2021 | 3:49 PM

Walking Calories: ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నకడ ఎంతో మంచిది. వాకింగ్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇప్పటికే వాకింగ్‌ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయో వైద్య నిపుణులు వెల్లడించిన విషయం తెలిసిందే. దీని వల్ల ఎన్నో రోగాలు నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీసం అరగంటానైనా వాకింగ్‌ చేస్తూ వివిధ రోగాలు దూరంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు.

నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..?

అయితే వేగంగా నడవడం వల్ల మన శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయనే విషయం మనకు తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటాయి. అయితే ఎంత వేగంగా నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి.. అనేది మనకు తెలియదు. తెలిస్తే మరికొన్ని కేలరీలు ఖర్చయ్యేలా నడుస్తాము. నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చుఅవుతాయో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

నిదానంగా నడవడం వల్ల..

మనం నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతాయి. 30 నిముషాల్లో 25 కేలరీలకు ఖర్చుచేయవచ్చు. ఇక నిదానంగా కాకుండా కాస్త సాధారణం కంటే కొంత వేగంతో నడిస్తే 15 నిముషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50 పైగా కేలరీలు ఖర్చవుతాయి. బ్రిస్క్‌ వాకింగ్‌ గానీ రన్నింగ్‌ కానీ చేస్తే మనం అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరగంటలో 250 కేలరీలను ఖర్చుచేయవచ్చు. నడిచే దూరాన్ని బట్టి కూడా కేలరీలు ఖర్చవటం అనేది జరుగుతుంది. కొంతమంది ఒక మైలుతో మొదలుపెట్టి రెండు నుండి నాలుగు మైళ్లవరకు వాకింగ్‌ చేస్తుంటారు.

వాకింగ్‌ ఎలా చేయాలి..?

వాకింగ్‌ మొదలు ప్రారంభించగానే గంటలు గంటలు నడవకుండా శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావుగంట పాటు నడవాలి. ఆ తర్వాత అరగంట, ఆపైన అరగంట నుంచి ముప్పావు గంటవరకు, తర్వాత గంటవరకు పెంచుతూ పోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావుగంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ మన శరీరంలో శక్తి స్థాయి, మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజూ నడవటం వల్ల అత్యధికంగా 1500 కేలరీల వరకు ఖర్చవుతాయి. వాకింగ్‌ అప్పుడే మొదలుపెట్టినవారికి ఇది మంచి ఫలితం. అయితే ఒకసారి వాకింగ్‌ మొదలుపెట్టాక దాన్ని ఆపకుండా చేస్తుండటం మంచిది. అప్పుడే సరైన ఫలితం కనబడుతుందని చెబుతున్నారు.

ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు..

ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్‌ చేస్తుంటారు. వేగంగా నడుస్తుంటారు. అలాంటి వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలా కఠిన మైన నియమాలు పెట్టుకుని వాకింగ్‌ చేస్తున్నా.. తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. వాకింగ్‌ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా తింటూ ఉంటారు. వీరు తినే ఆహారం కూడా ఎక్కు వగా జంక్‌ ఫుడే అయి ఉంటుంది. ఇలాంటివారు ఎంతగా వాకింగ్‌ చేసినా.. బరువు తగ్గటం అంటూ ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అయిపోతుంది. వాకింగ్‌ చేసినా.. బరువు తగ్గాలనుకున్నా.. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి.

రోజుకు అరగంట పాటు నడిస్తే..

బరువు తగ్గాలనుకునే వారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్నకొద్ది రెండు నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పనిసరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రెండువారాలు నడిచి ఇంకా బరువు తగ్గటం లేదని నిరాశపడి వాకింగ్‌ చేయడం మానేస్తుంటారు. అలా చేయకూడదు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఒపికతో క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తుండాలి. తర్వాత ఫలితం ఉంటుంది.

మలుపుల్లో నడిస్తే మంచిది..

వాకింగ్‌ చేసేవారు మలుపుల్లో నడిస్తే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డుమీద కాకుండా మలుపులు ఉన్న బాటలో నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయట. అలాగే ముందుకు కాకుండా వెనక్కు నడిస్తే మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చట. వెనక్కు నడిస్తే మన గుండె వేగం మరింత ఎక్కువగా ఉంటుందట. దాంతో సాధారణ నడకతో కంటే ఈ రివర్స్‌ నడకతో గుండెకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ కేలరీలు సైతం ఖర్చవుతాయి. వెనుక నుండి వాహనాలు రావనే నమ్మకం ఉన్న ప్రదేశాల్లో కొంత సమయం ఇలా నడవవచ్చు.

డయాబెటిస్‌, గుండె జబ్బులున్నవారికి..

ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌ ఉన్న వారికి మరి మంచిది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తే షుగర్‌ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ అనేది ఒక్క బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. శరీరం హుషారుగా ఉండేటట్లు చేస్తుంది. క్రమం తప్పకుండా వాకింగ్‌ చేసిన వారు చురుకుగా ఉంటారు.

ఇవి కూడా చదవండి:

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!

Amla Health Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!

కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి