Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!

Heart Disease: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతమున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం..

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:19 PM

Heart Disease: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతమున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో హార్ట్‌ స్ట్రోక్‌, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. అయితే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు నిర్వహించిన పలు పరిశోధనలలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మన నిద్ర గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. సరైన నిద్రలేని కారణంగా స్ట్రోక్‌ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల జరిపిన పరిశోధనలలో పలు విషయాలు వెలుగు చూశాయి. ఈ పరిశోధన నివేదిక యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలలో నిద్రకు, గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని తెలియజేశారు. వీరి పరిశోధనల ప్రకారం.. అర్ధరాత్రి లేదా, చాలా ఆలస్యంగా నిద్రపోతే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందని గుర్తించారు. త్వరగా సమయానుకూలంగా నిద్రించడం వల్ల గుండెకు ఎంతో మేలని, గుండెకు సంబంధించిన ప్రమాదాలను తగ్గించుకోవచ్చంటున్నారు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నిద్రించాలి?

సరైన నిద్రపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. రోజు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల సిర్కాడియన్‌ రిథమ్‌ దిగజారుతుంది. దీనిని మరింతగా మెరుగుపర్చాలంటే రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆలస్యంగా నిద్రపోయే మహిళలు ఈ సమయాలను పాటించడం చాలా అవసరమని చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రించేవారు ఉదయం వేళ ఆలస్యంగా మేల్కొంటారు. ఫలితంగా వారిలో జీవ గడియారం వేళలు మారుతాయి. ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

88వేల మందిపై పరిశోధన:

పరిశోధనలలో భాగంగా పరిశోధకులు 43 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న 88వేల మంది బ్రిటీష్‌ పెద్దలపై పరిశోధనలు చేశారు. ఇందులో వారు నిద్రించే సమయాలు, జీవనశైలికి సంబంధించిన అంశాలతో బేరీజు వేసుకున్నారు. ఈ పరిశోధనలలో ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండె జబ్బులు, గుండె పోటు, స్ట్రోక్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు. రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోయే వారిలో గుండె జబ్బులు తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. ఇక అర్ధరాత్రి తర్వాత నిద్రిపోయే వారిలో 25 శాతం ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయ్ని పరిశోధకులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

Hand Numbness: మీకు అలాంటి సమయంలో తిమ్మిర్లు వస్తున్నాయా..? ప్రమాదమే.. వైద్యులను సంప్రదించండి..!

వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి..? ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్‌.. గుర్తించని వైరస్‌లు మరెన్నో..!

Amla Health Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!