Shilpa Chowdhury: వెలుగు చూస్తున్న శిల్పా చౌదరి మోసాలు.. నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మహేష్‌బాబు చెల్లి ప్రియ..

శిల్పాచౌదరి మోసం చేసినవారి జాబితా పెరిగిపోతోంది. ఒక్కొక్కరుగా బాధితులు బయటకి వస్తున్నారు. తాజాగా హీరో సుధీర్‌బాబు భార్య , మహేష్‌బాబు సోదరి ప్రియను కూడా శిల్పాచౌదరి మోసం చేసింది.

Shilpa Chowdhury: వెలుగు చూస్తున్న శిల్పా చౌదరి మోసాలు.. నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మహేష్‌బాబు చెల్లి ప్రియ..
Shilpa Chowdhury
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 01, 2021 | 7:55 PM

శిల్పాచౌదరి మోసం చేసినవారి జాబితా పెరిగిపోతోంది. ఒక్కొక్కరుగా బాధితులు బయటకి వస్తున్నారు. తాజాగా హీరో సుధీర్‌బాబు భార్య , మహేష్‌బాబు సోదరి ప్రియను కూడా శిల్పాచౌదరి మోసం చేసింది. 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వకపోవడంతో నార్సింగ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ప్రియ. మరోవైపు శిల్పాచౌదరి కేసు పోలీసులను ముప్ప తిప్పలు పెడుతోంది. ఆమె బాధితుల్లో ఎక్కువ మంది ప్రముఖులే ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. తమకు రావల్సిన 40 కోట్ల రూపాయల ఇప్పించాలని సైబరాబాద్ పోలీసుల వెంటపడ్తున్నారు ప్రముఖులు. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి ఉన్న 6 బ్యాంక్ అకౌంట్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాలు ఇవ్వాలంటూ బ్యాంకర్లకు లేఖ రాశారు నార్సింగి పోలీసులు.

అయితే కొంత మంది బాధిత బడా మహిళలు మాత్రం ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. బ్లాక్ మనీ, ఐటీకి బయపడి ఫిర్యాదు చేయలేకపోతున్నారట. కుటుంబ సభ్యులకు చెప్పకుండా డబ్బులు ఇచ్చి తలలు పట్టుకుంటున్నారు పేజ్ త్రీ మహిళలు. శిల్పా ఎపిసోడ్‌లో అనేక కోణాలున్నాయి. కొందరు పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరికొందరు మాత్రం కంప్లైంట్ చేయడానికి ముందుకు రావడం లేదు.తాజాగా హీరో సుధీర్‌బాబు భార్య ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ఇంకా మరికొందరు కూడా బయటకి వచ్చే అవకాశం ఉంది.

మరోతమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజేంద్ర నగర్ కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు శిల్పా చౌదరి, భర్త శ్రీనివాస్‌. కాదు కాదు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఈ రెండింటిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..

Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..