Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పొలం పనుల కోసం వెళ్లి శవమై కనిపించిన నలుగురు కుటుంబసభ్యులు.. పోలీసుల విచారణలో సంచలనాలు!

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందని నలుగురిని దుండగులు నరికి చంపారు. ఈ దారుణ సంఘటన సింగ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది.

Crime News: పొలం పనుల కోసం వెళ్లి శవమై కనిపించిన నలుగురు కుటుంబసభ్యులు.. పోలీసుల విచారణలో సంచలనాలు!
Jharkhand Family Murder
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 02, 2021 | 6:15 PM

Jharkhand Family Murdered: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందని నలుగురిని దుండగులు నరికి చంపారు. ఈ దారుణ సంఘటన సింగ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు వ్యక్తులను గుర్తుతెలియ‌ని దుండ‌గులు అత్యంత కిరాత‌కంగా గొడ్డలితో నరికి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్‌భూమ్ జిల్లాలోని కెండ‌పోసి గ్రామంలో ఒనాము ఖండైట్ అనే వ్యక్తి త‌న భార్య మ‌ణి, త‌మ్ముడు గొబ్రూ, మైన‌ర్ అయిన కొడుకుతో క‌లిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో హత్‌గమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కెండపోసి గ్రామంలో వారి ఇంటి సమీపంలోని వరి పొలంలో నలుగురు దారుణహత్యకు గురయ్యారు. శ‌నివారం ఉద‌యం ఆ న‌లుగురు త‌మ పంట‌పొలాల్లోనే విగత జీవులై పడి ఉన్నారు. ఉద‌యం పొలం పనుల కోసం వెళ్లిన గ్రామ‌స్తుల‌కు న‌లుగురి మృతదేహాలను గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురినీ గుర్తు తెలియ‌ని వ్యక్తులు గొడ్డలితో న‌రికి చంపినట్లు గుర్తించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్ట నిమిత్తం త‌ర‌లించారు. కాగా, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి హ‌త్యల‌కు గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. భూత‌గాదాలే హ‌త్యల‌కు కార‌ణ‌మ‌ని త‌మ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్లు పోలీసులు చెప్పారు. ప్రత్యేక బృందాలచేత హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన సింగ్‌భూమ్ పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాలతో కలిసి విందు చేసిన తర్వాత వారు గొడ్డలితో నరికి చంపబడ్డారని పోలీసు సూపరింటెండెంట్ అజయ్ లిండా తెలిపారు. విందులో పాల్గొన్న వారిని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Read Also….  Aadhaar: UIDAI మరో ప్రకటన.. కొత్తగా 166 ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు.. ఇక్కడ ఏ పనులు జరుగుతాయంటే..?