Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: UIDAI మరో ప్రకటన.. కొత్తగా 166 ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు.. ఇక్కడ ఏ పనులు జరుగుతాయంటే..?

Aadhaar: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశవ్యాప్తంగా 166 ఆధార్ నమోదు, నవీకరణ కేంద్రాలను ప్రారంభించింది. శనివారం అధికారికంగా ట్విట్టర్‌

Aadhaar: UIDAI మరో ప్రకటన.. కొత్తగా 166 ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు.. ఇక్కడ ఏ పనులు జరుగుతాయంటే..?
Aadhaar Seva Kendra
Follow us
uppula Raju

|

Updated on: Oct 02, 2021 | 6:12 PM

Aadhaar: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశవ్యాప్తంగా 166 ఆధార్ నమోదు, నవీకరణ కేంద్రాలను ప్రారంభించింది. శనివారం అధికారికంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇది కాకుండా 52,000 ఆధార్ నమోదు కేంద్రాలు బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఆధార్ సేవా కేంద్రాలు వారంలో ఏడు రోజులు పనిచేస్తాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు వికలాంగులతో సహా 70 లక్షల మంది ప్రజల అవసరాలను తీర్చాయి. మోడల్ A ఆధార్ సేవా కేంద్రాలు (మోడల్- A ASK లు) రోజుకు 1,000 ఆధార్‌ నమోదులు, అప్‌డేట్ అభ్యర్థనలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదే సమయంలో మోడల్ B కేంద్రాలు (మోడల్- B ASK లు) 500, మోడల్-సి ASK లు 250 నమోదులు, అప్‌డేట్‌ అభ్యర్థనలను నెరవేర్చగలవు. ఇప్పటివరకు UIDAI 130.9 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను అందించింది.

ఆధార్ సేవా కేంద్రం ప్రైవేట్‌గా ఉండదు.. ఆధార్ సేవా కేంద్రం ప్రైవేట్‌గా ఉండదు. కేవలం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఉమ్మడి సేవా కేంద్రం (CSC), రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కార్యాలయం, UIDAI ద్వారా నిర్వహించే ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆధార్ కేంద్రాలు ప్రైవేట్‌గా పనిచేయవు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్థానిక అధికారుల నుంచి తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ సెంటర్లు అయితే ఇంటర్‌నెట్‌ సెంటర్లలో కూడా ఆధార్‌కు సంబంధించిన సేవలు లభిస్తాయి. అయితే కొన్ని నిబంధనలకు లోబడి UIDAI కొంతమందికి యాక్సెస్‌ ఇస్తుంది. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలను సరిచేయడం, ఫోటో మార్చడం, పివిసి కార్డు ముద్రించడం, ఉమ్మడి ఆధార్ కార్డును ఆర్డర్ చేయడం మొదలైన పనులు చేయడానికి అనుమతి ఇస్తుంది.

UIDAI వెబ్‌సైట్‌లో చేయవచ్చు UIDAI వెబ్‌సైట్‌లో సామాన్యుడు ఈ పనులన్నీ స్వయంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాగే పుట్టిన తేదీలో మార్పులు, PVC కార్డు పొందడానికి UIDAI స్థిర రుసుము రూ.50. కానీ ఇంటర్‌ నెట్‌ సెంటర్లు రూ.70 నుంచి100 వరకు వసూలు చేస్తారు. ఈ విధంగా వారు లాభం పొందుతారు.

MI vs DC, IPL 2021: పంత్ సేన టార్గెట్ 130.. ముంబై బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన ఢిల్లీ బౌలర్లు

Maruti: ఈ కారు ధర రాయల్‌ ఎన్‌ఫీల్డ్ కంటే తక్కువ.. జీరో డౌన్‌ పేమెంట్‌.. 6 నెలల వారంటీ

Whatsapp: మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ కీలక నిర్ణయం.. 46 రోజుల్లో 30 లక్షల భారతీయుల ఖాతాల బ్యాన్.. కారణం అదేనా?