MI vs DC, IPL 2021: పంత్ సేన టార్గెట్ 130.. ముంబై బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన ఢిల్లీ బౌలర్లు

MI vs DC: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

MI vs DC, IPL 2021: పంత్ సేన టార్గెట్ 130.. ముంబై బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన ఢిల్లీ బౌలర్లు
Ipl 2021 Mi Vs Dc, Axar Patel, Avesh Khan
Follow us

|

Updated on: Oct 02, 2021 | 5:29 PM

DC vs MI: కీలకమైన మ్యాచులో ముంబై ఇండియన్స్ టీం టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందు 130 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్లే ఆఫ్‌లో నిలవాలంటే మాత్రం ముంబై ఇండియన్స్ టీం కచ్చితంగా గెలవాల్సిందే. అయితే బ్యాటింగ్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. ‎ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీగా మలిచి మంచి ఊపులో కనిపించిన రోహిత్.. ఆ తరువాత అవేష్ ఖాన్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి చ్చిన సూర్య కుమార్‌తో కలిసి డికాక్ (19) ధాటిగానే పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నార్ట్జేకు క్యాచ్ డికాక్ పెవిలియన్ చేరాడు.

మరోవైపు సూర్య కుమార్ (33 పరుగులు, 26 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) మాత్రం ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్ మరోసారి ముంబై ఇండియన్స్‌ను దెబ్బ కొట్టాడు. రబాడాకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 68 పరుగుల వద్ద సూర్య కుమార్ వెనుదిరిగాడు.

సౌరభ్ తివారి (15)తో కలిసి పొలార్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. కానీ, మరోసారి అక్షర్ పటేల్ అద్భుత బంతికి బోల్తా పడిన సౌరభ్ తివారి కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 80 పరుగుల నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత వెంట వెంటనే వికెట్లు కోల్పోతూ ముంబై ఇండియన్స్ టీం ఏ దశలోనూ కోలుకోలేక చతికిలపడింది. పొలార్డ్ 6, హార్దిక్ 17, నీల్ 1, జయంత్ యాదవ్ 11 పరుగులతో నిరాశ పరిచారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ తలో 3 వికెట్లు, నార్ట్జే, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: Asian TT Championships: చరిత్ర సృష్టించిన భారత టీటీ జట్టు.. సెమీ ఫైనల్లో ఓడినా.. 45 ఏళ్లకు దక్కిన పతకం

MI vs DC Live Score, IPL 2021: ఢిల్లీ టార్గెట్ 130.. బౌలర్ల దెబ్బకు ముంబై ఇండియన్స్ విలవిల