AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian TT Championships: చరిత్ర సృష్టించిన భారత టీటీ జట్టు.. సెమీ ఫైనల్లో ఓడినా.. 45 ఏళ్లకు దక్కిన పతకం

భారత పురుషుల ఆటగాళ్లు సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్టుతో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఇరాన్‌ను 3-1తో ఓడించి భారత జట్టు పతకాన్ని ఖాయం చేసుకుంది.

Asian TT Championships: చరిత్ర  సృష్టించిన భారత టీటీ జట్టు.. సెమీ ఫైనల్లో ఓడినా.. 45 ఏళ్లకు దక్కిన పతకం
Asian Tt Championships
Venkata Chari
|

Updated on: Oct 02, 2021 | 3:22 PM

Share

Asian TT championships: దోహా, ఖతార్‌లోని లుసైల్ స్పోర్ట్స్ అరేనాలో శుక్రవారం జరిగిన ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జట్టు సెమీ ఫైనల్స్‌లో అగ్రశ్రేణి దక్షిణ కొరియా నాల్గవ సీడ్ ఇండియాను 3-0తో ఓడించింది. అయితే, భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు ఓడిపోయి కాంస్య పతకంతో తన ప్రచారాన్ని ముగించింది. మానికా బాత్రా లేకుండా, భారత మహిళల జట్టు ఐదవ స్థానం కోసం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1తో గెలిచింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఇరాన్‌ను 3-1తో ఓడించి భారత జట్టు పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన రెండు జట్లకు కాంస్య పతకాలు లభిస్తాయి. 1976 తర్వాత ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. ఆ సమయంలో మంజిత్ సింగ్ దువా, విలాస్ మీనన్ జోడి పురుషుల డబుల్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించారు.

భారత పురుషుల ఆటగాళ్లు సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్టుతో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. పతకంపై భరోసాతో బరిలోకి దిగిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ప్రత్యర్థి జట్టు సవాలుకు నిలవలేకపోయారు. అగ్రశ్రేణి దక్షిణ కొరియా జట్టు చాలా మెరుగ్గా ఆడి ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచ 12 వ కొరియన్ ఆటగాడు వూజిన్ జాంగ్ మొదటి మ్యాచ్‌లో 11-5, 10-12, 11-8, 11-5తో జీ సత్యన్ (ప్రపంచ నంబర్ 38 ఆటగాడు) ను ఓడించాడు.

శరత్ ఆధిక్యాన్ని కోల్పోయాడు రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ మంచి ఆరంభాన్ని పొందాడు. కానీ, ఆ తరువాత 2-1 తేడాతో మ్యాచును కోల్పోయాడు. ప్రపంచ నం. 22 లీ సాంగ్సుపై 7-11, 15-13, 8-11, 11-6, 11-9 తేడాతో గెలిచాడు. హ్యూమీత్ దేశాయ్‌కు సియుంగ్‌మిన్ చోపై మంచి ఆరంభం లేభించలేదు. కానీ, అనంతరం పుంజుకు 2-1 ఆధిక్యాన్ని సాధించగలిగాడు. అయితే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హర్‌మీత్ 77 వ స్థానంలో ఉన్నాడు. 81 వ స్థానంలో నిలిచిన చోపై 11-4, 9-11, 8-11, 11-6, 13-11 తేడాతో 43 నిమిషాల్లో పుంజుకుని 2-2 డ్రా చేసుకున్నాడు.

భారత యువ మహిళల జట్టు ప్లేఆఫ్ లో గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించింది. థాయ్‌లాండ్‌ను 3-1తో ఓడించి ఐదవ స్థానంలో నిలిచింది. ఒలింపియన్ సుతీర్థ ముఖర్జీ కీలక పాత్ర పోషించారు.

ముఖర్జీకి ఐదవ స్థానం అర్చనా కామత్ థాయ్‌లాండ్ టాప్ ర్యాంకర్ సుత్సాని సవెతాబట్ (ప్రపంచ ర్యాంకింగ్ 38) తో తలపడింది. అయితే థాయ్ ప్లేయర్ 11-7, 7-11, 11-6, 10-12, 11-9తో గెలిచింది. ముఖర్జీ ఫాంటిటా పిన్యోపిసన్‌ను 11-5, 11-5, 11-6తో 18 నిమిషాల్లో ఓడించింది. శ్రీజా ఆకుల 11-7, 11-6, 11-2తో వీరకర్ణ తైపీటక్ పై గెలిచింది. సింగిల్స్‌లో ముఖర్జీ 11-7, 11-6, 10-12, 117 సవేతాబాట్‌ను ఓడించి తన జట్టును ఐదవ స్థానానికి చేర్చింది.

Also Read: MI vs DC Live Score, IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా ఎక్కడ ఉన్నా జావెలిన్‌ గురించే ఆలోచిస్తాడు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోనే సాక్ష్యం.