Neeraj Chopra: నీరజ్ చోప్రా ఎక్కడ ఉన్నా జావెలిన్ గురించే ఆలోచిస్తాడు.. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోనే సాక్ష్యం.
Neerja Chopra: తాజాగా జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌ను గెలుచుకొని దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. దాదాపు వందేళ్ల తర్వాత భారత్‌కు అథ్లెట్స్‌లో పతకాన్ని అందించిన..
Neeraj Chopra: తాజాగా జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌ను గెలుచుకొని దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. దాదాపు వందేళ్ల తర్వాత భారత్‌కు అథ్లెట్స్‌లో పతకాన్ని అందించిన నీరజ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా నీరజ్‌ను దేశ ప్రజలంతా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఆటపై తనకున్న ఇష్టం, కష్టపడే తత్త్వమే ఆయనను దేశం మెచ్చే ఆటగాడిగా మార్చాయి. గతంలో నీరజ్ చోప్రా ప్రాక్టిసింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న మరో వీడియో గేమ్‌పై నీరజ్‌కు ఉన్న ఇష్టం ఎలాంటిదో చాటి చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. నీరజ్ చోప్రా ప్రస్తుతం హాలీడేలో ఉన్నాడు. ఇందులో భాగంగా మాల్దీవుల్లో జాలీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నీరజ్ సముద్రం అడుగున స్కూబా డైవింగ్ చేశాడు. ఇందులో భాగంగా తీసిన వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే వీడియో తీస్తున్న సమయంలో సముద్రం అడుగున కూడా నీరజ్.. బల్లెం విసిరినట్లు చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘ఆకాశంలో.. నేలపై.. చివరికి నీటి అడుగున కూడా నేను ఎల్లప్పుడూ జావెలిన్ త్రో గురించే ఆలోచిస్తాను. నా శిక్షణ మళ్లీ మొదలైంది’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Aasman par, zameen pe, ya underwater, I’m always thinking of the javelin!
PS: Training shuru ho gayi hai ?? pic.twitter.com/q9aollKaJx
— Neeraj Chopra (@Neeraj_chopra1) October 1, 2021
APPSC Recruitment DPRO: ఆంధ్రప్రదేశ్‌లో డీపీఆర్‌ఓ పోస్టులు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.