Ghost Challenge: రోడ్లు, పార్కులు, టూరిస్టు ప్లేసులు ఇలా ఎక్కడ చూసినా దెయ్యాలే.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటోలు.
Ghost Challenge: సోషల్ మీడియ విస్తృతి పెరిగినప్పటి నుంచి రోజుకో చాలెంజ్ పుట్టుకొస్తుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్, బాటిల్ ఫ్లిప్పింగ్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, కికి డ్యాన్స్ ఛాలెంజ్ ఇలా చెప్పుకుంటూ పోతే..
Ghost Challenge: సోషల్ మీడియ విస్తృతి పెరిగినప్పటి నుంచి రోజుకో చాలెంజ్ పుట్టుకొస్తుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్, బాటిల్ ఫ్లిప్పింగ్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, కికి డ్యాన్స్ ఛాలెంజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల చాలెంజ్‌లు సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. అయితే వీటిలో కొన్ని ఆనందాన్ని పంచేవి ఉంటే మరికొన్ని మాత్రం ప్రమాదానికి గురి చేసేవి ఉన్నాయి. కొన్ని చాలెంజ్‌లు చేసే వారికి ఇబ్బందిగా ఉంటే మరికొన్ని మాత్రం ఇతరలకు ఇబ్బందిగా మారుతున్నాయి. తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతోన్న చాలెంజ్ ఈ కోవలోకే వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఘోస్ట్ ఫోటో ఛాలెంజ్’ పేరుతో కొన్ని ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.
నిజానికి ఈ ఛాలెంజ్ ఇప్పడికిప్పుడే వచ్చింది కాదు.. 2020లో టిక్‌టాక్‌లో హాలోవీన్ పేరుతో మొదలైంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఒళ్లంతా తెల్లటి క్లాత్‌ను ధరించి… కళ్లకు నల్లటి కళ్లజోడు పెట్టుకొని దెయ్యాన్ని పోలిన విధంగా మారాలి. అనంతరం పబ్లిక్ ప్రదేశాల్లో రకరకలా ఫోజులిస్తూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరులకు ఈ ఛాలెంజ్‌ను విసరాలి. ఇదీ క్లుప్తంగా ఘోస్ట్ ఛాలెంజ్.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా #ghostphotochallenge, #ghostphotoshoot పేరుతో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అంత బాగానే ఉన్నా దెయ్యాల గెటప్‌లో ఉన్న వ్యక్తులను చూసిన వారి గుండెలు జారి పోతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోన్న కొన్ని ఘోస్ట్ చాలెంజ్ సంబంధిత ఫొటోలపై ఓ లుక్కేయండి..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Jaggery Gram Benefits: బెల్లం, పప్పు కలిపి తింటే అనేక ప్రయోజనాలు.. తెలిస్తే రోజూ తినేస్తారు..