AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery Gram Benefits: బెల్లం, పప్పు కలిపి తింటే అనేక ప్రయోజనాలు.. తెలిస్తే రోజూ తినేస్తారు..

సాధారణంగా.. బెల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిన విషయమే. రోజూ బెల్లం తినడం వలన శరీరంలో రక్తం పెరుగుతుంది.

Jaggery Gram Benefits: బెల్లం, పప్పు కలిపి తింటే అనేక ప్రయోజనాలు.. తెలిస్తే రోజూ తినేస్తారు..
Jaggery
Rajitha Chanti
|

Updated on: Oct 02, 2021 | 11:10 AM

Share

సాధారణంగా.. బెల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిన విషయమే. రోజూ బెల్లం తినడం వలన శరీరంలో రక్తం పెరుగుతుంది. అలాగే శుద్దిగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే కాస్త బెల్లం తిన్న గొంతు సాఫీగా ఉంటుంది. అయితే బెల్లంతోపాటు పప్పును కలిపి తినడం వలన కూడా అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి మీకు తెలుసా.. వీటిని విడివిడిగా తినడం కంటే కలిపి తీసుకోవడం వలన రేట్టింపు ప్రయోజనాలున్నాయి. ఇవి శరీరాన్ని అనారోగ్యాల భారిన పడకుండా చేస్తాయి. అలాగే.. రక్తహీతన సమస్యను నివారిస్తుంది. జుట్టు రాలే సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. చర్మ సమస్యలను కూడా తగ్గించవచ్చు. బెల్లం, పప్పు కలిపి తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.

1. శరీరంలో రక్తంప లోపం ఉన్నప్పుడు.. మందులు, సప్లిమెంట్స్ బదులుగా బెల్లం తీసుకోవాలి. బెల్లం, పప్పు కలిపి తీసుకోవడం వలన రక్తహీనత తగ్గుతుంది. అలాగే శరీరంలో బ్లడ్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెరగడమే కాకుండా.. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. 2. వేయించిన పప్పులో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన శరీరంలో ఐరన్, ప్రోటీన్ లోపం తగ్గుతుంది. దీంతోపాటు ఇందులో ఉండే ఇతర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 3. అంతేకాకుండా.. బెల్లం, పప్పు కలిపి తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. వృద్ధాప్య సమయంలో ఎముకలు బలహీన పడడం జరుగుతుంది. ఈ సమయంలో వృద్దులు బెల్లం, పప్పు కలిపి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. 4. బెల్లం, పప్పులో ఫైబర్ ఉంటుంది. ఈ రెండింటినీ తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం.. అసిడిటీ సమస్య కూడా తగ్గుతుంది.

Also Read: Prakash Raj: విష్ణుపై సంచనల వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్‌ రాజ్‌.. పవన్‌ మార్నింగ్ షో కలెక్షన్ల అంత కాదంటూ..

Annatthe: విడుదలకు సిద్ధమైన SP బాలు పాట.. అన్నాత్తే నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

Pushpa Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్.. పుష్పరాజ్ వచ్చేది అప్పుడే..