CM YS Jagan: స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం.. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌-క్లాప్‌ను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్

క్లీన్‌ గ్రామాలు, క్లీన్‌ నగరాలు, క్లీన్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా మహాయజ్ఞం చేపట్టింది ఏపీ సర్కారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో స్వచ్ఛసంకల్పం.. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్

CM YS Jagan: స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం.. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌-క్లాప్‌ను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్
Cm Jagan
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 02, 2021 | 11:40 AM

Clean Andhra Pradesh: క్లీన్‌ గ్రామాలు, క్లీన్‌ నగరాలు, క్లీన్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా మహాయజ్ఞం చేపట్టింది ఏపీ సర్కారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో స్వచ్ఛసంకల్పం.. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. చెత్త సేకరణ కోసం 4,097 గార్బేజ్‌ టిప్పర్లను జెండా ఊపిప్రారంభించారు. క్లాప్‌ కార్యక్రమం సీడీని ఆవిష్కరించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా క్లాప్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. అంతకుముందు.. వేదికపై ఉన్న మహాత్మా గాంధీ, శాస్త్రి విగ్రహాలకు నివాళులు అర్పించారు సీఎం జగన్.

అనంత‌రం జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. ఇవాళ క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌–క్లాప్ కార్యక్రమం సంద‌ర్భంగా సదరు వాహ‌నాలు విజ‌య‌వాడ‌లోని బెంజి స‌ర్కిల్ నుంచి బారులుగా ప‌రుగులు తీరాయి. స్వచ్ఛాంధ్రపదేశ్‌ నినాదంతో చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయ‌తీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం ప్రవేశ పెడుతున్నారు. 10 వేల మంది గ్రామ పంచాయ‌తీ కార్మికులు ,కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నారు.

ఇప్పటికే పరిశుభ్రతలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు అవార్డులు వచ్చాయి. శానిటేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌లు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, నాయకులు దేవినేని అవినాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read also: North Korea: ఉత్తర-దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తత.. నువ్వా-నేనా అన్నట్టు ప్రయోగిస్తోన్న క్షిపణులు