Rashi Khanna: చేదుగా ఉండే కాఫీ మన మార్నింగ్స్‌ను స్వీట్‌గా ఎలా మారుస్తుందో కదా.! ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన ముద్దుగుమ్మ..

Rashi Khanna: హిందీ చిత్రం 'మద్రాస్‌ కేఫ్‌'తో వెండి తెరకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. ఇక మనం చిత్రంలో తళుక్కుమన్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులను సైతం మెస్మరైజ్‌ చేసింది...

Rashi Khanna: చేదుగా ఉండే కాఫీ మన మార్నింగ్స్‌ను స్వీట్‌గా ఎలా మారుస్తుందో కదా.! ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన ముద్దుగుమ్మ..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 02, 2021 | 11:37 AM

Rashi Khanna: హిందీ చిత్రం ‘మద్రాస్‌ కేఫ్‌’తో వెండి తెరకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. ఇక మనం చిత్రంలో తళుక్కుమన్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులను సైతం మెస్మరైజ్‌ చేసింది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో కుర్రకారు హృదయాల్లో గుడి కట్టుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన ఆడిపాడే అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. ఇక ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌లకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది అందాల రాశీ.

ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోన్న రాశీ ఖన్నా సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత వివరాలతో పాటు సినిమా విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకునే ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టా్గ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. బాల్కనీలో కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతోన్న సమయంలో దిగిన ఓ ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘చేదుగా ఉండే కాఫీ మన మార్నింగ్స్‌ను స్వీట్‌గా మార్చడం నిజంగా అద్భుతం కదూ!’ అంటూ క్యాప్షన్‌ జోడించింది.

ఇదిలా ఉంటే రాశీ ఖన్నా తాజాగా నటించిన ‘అంధాధూన్’కు మలయాళ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘భ్రమం’ సినిమా ఈ నెల 7వ తేదీన అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవుతోంది. ఇందులో భాగంగా నిర్వహించి ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాశీ తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని తెలిపింది. ఒక నటిగా, వ్యక్తిగా రోజురోజుకూ మెరుగుపడుతున్నానని, నేను గొప్ప విజయాలు సాధించలేకపోవచ్చు.. కానీ, మంచి నటిగా నిరూపించుకున్నాని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: Jaggery Gram Benefits: బెల్లం, పప్పు కలిపి తింటే అనేక ప్రయోజనాలు.. తెలిస్తే రోజూ తినేస్తారు..

Prakash Raj: విష్ణుపై సంచనల వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్‌ రాజ్‌.. పవన్‌ మార్నింగ్ షో కలెక్షన్ల అంత కాదంటూ..

EBC Nestham Scheme: అగ్రకుల మహిళలకు గుడ్ న్యూస్.. ఈబీసీ నేస్తం కోసం దరఖాస్తులకు ఆహ్వానం..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!