AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లోకి అనుకోని అతిథి.. వీఐపీ లాంజ్‌లో హల్చల్‌ చేసిన వానరం. వైరల్‌ వీడియో..

Viral Video: అడవుల సాంధ్రత తగ్గడం, అడవుల్లో వనరుల కొరత ఏర్పడడం కారణం ఏదైనా అరణ్యాల్లో ఉండాల్సిన మూగ జీవాలు పట్టణంలోకి రావడం ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే..

Viral Video: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లోకి అనుకోని అతిథి.. వీఐపీ లాంజ్‌లో హల్చల్‌ చేసిన వానరం. వైరల్‌ వీడియో..
Narender Vaitla
|

Updated on: Oct 02, 2021 | 1:13 PM

Share

Viral Video: అడవుల సాంధ్రత తగ్గడం, అడవుల్లో వనరుల కొరత ఏర్పడడం కారణం ఏదైనా అరణ్యాల్లో ఉండాల్సిన మూగ జీవాలు పట్టణంలోకి రావడం ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే అటవీ ప్రాంతాల పక్కన ఉన్న ప్రాంతాల్లోకి జంతువులు రావడం కొంత వరకు కామన్‌ అనుకోవచ్చు. అలా కాకుండా పెద్ద పెద్ద నగరాల్లోకి వస్తుండడమే కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ఏకంగా విమానాశ్రయాలలోకే జంతువులు వస్తే.. తాజాగా ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లో ఇలాంటి ఓ సంఘటన జరిగింది.

అది ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌.. ప్రయాణికులంతా విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ.. ఓ కోతి ఎంచక్కా ఎయిర్‌ పోర్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హై సెక్కూరిటీ ఎరియాగా ఉండే ఎయిర్‌ పోర్ట్‌లో ఎంతో మంది భద్రతా సిబ్బంది కళ్లను కప్పిన వానరం హుందాగా ఎంట్రీ ఇచ్చింది. అక్కడితో ఆగని ఆ వానరం.. ఓ డ్రింక్‌ స్టాల్‌ వద్ద హల్చల్‌ చేసింది. దీనంతటిని అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఎయిర్‌ పోర్ట్‌లోకి ఇలా జంతువులు వస్తే ప్రయాణికుల రక్షణ ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎయిర్‌ పోర్టులో వానరం చేసిన హంగామాను మీరూ చూసేయండి మరి..

Also Read: Kannada Tv Actress Soujanya: యువనటి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ప్రియుడిపై తండ్రి ఫిర్యాదు..

Mahatma Gandhi: తూర్పుగోదావరితో మహాత్మాగాంధీకి విడదీయలేని బంధం.. జిల్లా అంతటా బాపు పాదముద్రలు.!

Ghost Challenge: రోడ్లు, పార్కులు, టూరిస్టు ప్లేసులు ఇలా ఎక్కడ చూసినా దెయ్యాలే.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫోటోలు.