Mahatma Gandhi: తూర్పుగోదావరితో మహాత్మాగాంధీకి విడదీయలేని బంధం.. జిల్లా అంతటా బాపు పాదముద్రలు.!

తూర్పుగోదావరి జిల్లాతో మహాత్మాగాంధీజీకి విడదీయలేని బంధం ఉంది. బాపు పాదముద్రలు జిల్లా అంతటా కనిపిస్తూ ఉంటాయి. అహింసే ఆయుధంగా కాశ్మీర్‌

Mahatma Gandhi: తూర్పుగోదావరితో మహాత్మాగాంధీకి విడదీయలేని బంధం.. జిల్లా అంతటా బాపు పాదముద్రలు.!
Mahatma Gandhi
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 02, 2021 | 12:42 PM

Mahatma Gandhi – East Godavari: తూర్పుగోదావరి జిల్లాతో మహాత్మాగాంధీజీకి విడదీయలేని బంధం ఉంది. బాపు పాదముద్రలు జిల్లా అంతటా కనిపిస్తూ ఉంటాయి. అహింసే ఆయుధంగా కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన బాపూజీ తూర్పుగోదావరి జిల్లా నేలపై కూడా అడుగులు వేశారు. కిలోమీటర్ల దూరం నడిచి స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. 1921, 1929, 1933, 1946లో జిల్లాలో పర్యటించి ఇక్కడి నేలను పునీతం చేశారు మహాత్మ.

రాజమండ్రి టూ సీతానగరం ఆయన గుర్తులు కనిపిస్తూనే ఉంటాయి. అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంతో పాటు.. జిల్లాలో అనేక ప్రసంగాల్లో గాంధీజీ పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా.. రాజమండ్రిలో సనాతన కుటుంబాలకు చెందిన 15 మందికి పైగా మహిళలు స్వాత్రంత్య్ర యోద్యమంలో పాల్గొన్నారు. వారంతా జైలు శిక్ష అనుభవించారని చరిత్ర చెప్తోంది. స్వరాజ్య నిధి సేకరణకు రాజమండ్రికి వచ్చిన గాంధీజీ.. 1921లో అప్పటి పాల్ చౌక్.. అంటే ఇప్పటి కోటిపల్లి బస్ స్టాండ్ సమీపంలో ప్రసంగించారు.

1929లో సీతానగరం గాంధీజీ కస్తూర్బా ఆశ్రమం తిలకించి ఎంతో మందికి స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు గాంధీజీ. ఆయన ఆనవాళ్ళు ఇంకా ఆ ఆశ్రమంలో కనిపిస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో రాజమండ్రి మున్సిపాలిటీ సిబ్బంది కూడా గాంధీజీకి సన్మానాలు చేశారని చెప్తున్నారు చరిత్రకారులు. ఆ గురుతులను ఇప్పటికీ స్మరించుకుంటున్నారు తూర్పు గోదావరి జిల్లా చరిత్ర కారులు.

Read also: Kurnool: నిర్లక్ష్యం నీడలో.. నిద్ర మత్తులో.. క్రీడా ప్రాధికార సంస్థ.. క్రీడాకారులకు నరకం

HMPV: భారత్‌లో తొలి HMPV కేసు.. 8 నెలల చిన్నారికి
HMPV: భారత్‌లో తొలి HMPV కేసు.. 8 నెలల చిన్నారికి
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం