AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs CSK Highlights in Telugu: రాజస్థాన్ అద్భుత విజయం.. ఐపీఎల్‌లోనే సూపర్ గేమ్.. భారీ స్కోర్‌ను ఛేదించిన శాంసన్ సేన

RR vs CSK Highlights in Telugu: నిర్ణీత లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ టీం కేవలం 17.3 ఓవర్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అద్భుత విజయాన్ని అందకున్నారు.

RR vs CSK Highlights in Telugu: రాజస్థాన్ అద్భుత విజయం.. ఐపీఎల్‌లోనే సూపర్ గేమ్.. భారీ స్కోర్‌ను ఛేదించిన శాంసన్ సేన
Ipl 2021 Rr Vs Csk
Venkata Chari
|

Updated on: Oct 02, 2021 | 11:39 PM

Share

RR vs CSK Highlights in Telugu:190 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్ ఏ దశలోనూ ఒత్తికి గురి కాకుండా ఫియర్ లెస్ బ్యాటింగ్ చేస్తూ విజయాన్ని సాధించారు. నిర్ణీత లక్ష్యాన్ని కేవలం 17.3 ఓవర్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అద్భుత విజయాన్ని అందకున్నారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ తొలి పవర్ ప్లే వరకు అద్భుతంగా ఆడి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సుల సహాయంతో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న రుతురాజ్ పరుగులు సాధిస్తూ రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేయడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించాడు. జడేజా కూడా చివరి ఓవర్ల బౌండరీల మోత మోగించాడు. 213 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి, కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 32 పరుగులు చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2021లో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న మొట్టమొదటి టీం ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. దీంతో 12 సార్లు ప్లే ఆప్‌లు చేరిన జట్టుగా మారింది. ఇలాంటి టీంతో శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ టీం డబుల్ హెడర్‌లో భాగంగా రెండో మ్యాచులో అబుదాబి వేదికగా తలపడబోతోంది.

ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 15, రాజస్థాన్ రాయల్స్ టీం 9 మ్యాచులు గెలిచింది.

ప్లేయింగ్ ఎలెవన్:

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దుల్ ఠాకూర్, ఆసిఫ్, జోష్ హాజెల్‌వుడ్

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 02 Oct 2021 11:24 PM (IST)

    రాజస్థాన్ అద్భుత విజయం

    190 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్ ఏ దశలోనూ ఒత్తికి గురి కాకుండా ఫియర్ లెస్ బ్యాటింగ్ చేస్తూ విజయాన్ని సాధించారు. నిర్ణీత లక్ష్యాన్ని కేవలం 17.3 ఓవర్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అద్భుత విజయాన్ని అందకున్నారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది.

  • 02 Oct 2021 10:56 PM (IST)

    శివం దుబే అర్థ సెంచరీ

    రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్న శివం దుబే కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో తన తొలి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ తరుపున కీలక ఇన్నింగ్స్ ఆడుతూ.. చెన్నై విధించిన భారీ స్కోర్‌ను చాలా చిన్నదిగా చేస్తూ.. రాజస్థాన్ టీంను విజయానికి చేరుస్తున్నాడు.

  • 02 Oct 2021 10:49 PM (IST)

    13ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 153/2

    13 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 153 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ 26, శివం దుబే 47 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 10:27 PM (IST)

    100 దాటిన రాజస్థాన్ స్కోర్

    190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ టీం చెన్నై బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 8.2 ఓవర్లు ముగిసే సరికి టీం స్కోరును రెండు వికెట్ల నష్టానికి సెంచరీ దాటించారు. శాంసన్ 16, శివం దుబే 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 10:19 PM (IST)

    7 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 89/2

    7 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 89 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ 9, శివం దుబే 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 10:15 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్

    జైస్వాల్ (50 పరుగులు, 21 బంతులు, 6 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. అసిఫ్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 81 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 02 Oct 2021 10:10 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్

    లూయిస్ (27 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ఠాకూర్ బౌలింగ్‌లో హజల్‌వుడ్‌కి క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 77 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 02 Oct 2021 10:02 PM (IST)

    50 దాటిన రాజస్థాన్ స్కోర్

    190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జైస్వాల్, లీవిస్ చెన్నై బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి 7 ఫోర్లు, 2 సిక్సులతో 180 పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తూ అర్థ సెంచరీ దాటించారు.

  • 02 Oct 2021 09:55 PM (IST)

    3 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 41/0

    3 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 41 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్ 27, లీవిస్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ధాటిగా ఆడుతూ మొదటి మూడు ఓవర్లలోనే 6 ఫోర్లు, 1 సిక్స్ బాదేశారు.

  • 02 Oct 2021 09:49 PM (IST)

    మొదలైన రాజస్థాన్ ఛేజింగ్

    190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ టీం బరిలోకి దిగింది. ఓపెనర్లుగా జైస్వాల్, లీవిస్ క్రీజులోకి వచ్చారు.

  • 02 Oct 2021 09:32 PM (IST)

    రాజస్థాన్ టార్గెట్ 190

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • 02 Oct 2021 09:27 PM (IST)

    రుతురాజ్ సెంచరీ

    చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సుల సహాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సమయంలో 168 స్ట్రైక్ రేట్‌తో పరుగుల వర్షం కురిపించాడు.

  • 02 Oct 2021 09:16 PM (IST)

    18 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 155/4

    18 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం 4 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 93, జడేజా 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 09:07 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    అంబటి రాయుడు (2) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. చేతన సకారియా బౌలింగ్‌లో గ్లెన్ పిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 134 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 02 Oct 2021 09:04 PM (IST)

    16 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 133/3

    16 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం 3 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 80, రాయుడు 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 08:50 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    అలీ (21) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 114 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 02 Oct 2021 08:42 PM (IST)

    రుతురాజ్ అర్థ సెంచరీ

    చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

  • 02 Oct 2021 08:39 PM (IST)

    13 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 97/2

    13 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం 2 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 48, అలీ 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 08:26 PM (IST)

    10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 63/2

    10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం 2 వికెట్లు నష్టపోయి 63 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 32, అలీ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 08:16 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    సురేష్ రైనా (3) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో శివమ్ దుబేకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 57 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 02 Oct 2021 08:08 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్

    డుప్లెసిస్ (25 పరుగులు, 19 బంతులు, 2 ఫోర్లు, సిక్స్) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది.

    6.5 ఓవర్లకు స్కోర్ 47/1

  • 02 Oct 2021 08:03 PM (IST)

    6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 44/0

    6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 20, డుప్లెసిస్ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 07:53 PM (IST)

    4 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 25/0

    4 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 18, డిప్లెసిస్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 07:42 PM (IST)

    2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 12/0

    2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 11, డుప్లెసిస్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 02 Oct 2021 07:39 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దుల్ ఠాకూర్, ఆసిఫ్, జోష్ హాజెల్‌వుడ్

    రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్

  • 02 Oct 2021 07:04 PM (IST)

    టాస్ గెలిచిన రాజస్థాన్

    47వ మ్యాచులో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 02 Oct 2021 06:47 PM (IST)

    RR vs CSK: హెడ్ టూ హెడ్

    ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 15, రాజస్థాన్ రాయల్స్ టీం 9 మ్యాచులు గెలిచింది.

Published On - Oct 02,2021 6:44 PM