IPL 2021, MI vs DC Match Result: లో స్కోరింగ్ మ్యాచ్.. చివరి ఓవర్‌ వరకు సాగిన ఉత్కంఠ.. 4 వికెట్ల తేడాతో ఢిల్లీదే విజయం

MI vs DC, IPL 2021: తక్కువ స్కోరింగ్ మ్యాచులోనూ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చివరి ఓవర్‌ వరకు పోరాడాల్సి వచ్చింది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

IPL 2021, MI vs DC Match Result: లో స్కోరింగ్ మ్యాచ్.. చివరి ఓవర్‌ వరకు సాగిన ఉత్కంఠ.. 4 వికెట్ల తేడాతో ఢిల్లీదే విజయం
Ipl 2021 Mi Vs Dc
Follow us
Venkata Chari

|

Updated on: Oct 02, 2021 | 7:35 PM

MI vs DC, IPL Match Result: తక్కువ స్కోరింగ్ మ్యాచులోనూ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చివరి ఓవర్‌ వరకు పోరాడాల్సి వచ్చింది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. టీం విజయంలో కీలక పాత్ర పోషించే ఓపెనర్లు ధావన్ (8), పృథ్వీ షా (6) పరుగులకే ఇన్నింగ్స్ 3 ఓవర్లలోపే పెవిలియన్ చేరారు. మొత్తంగా తొలి పవర్ ప్లే లోపే మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. స్మిత్ (9) కూడా త్వరగా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అనంతరం రిషబ్ పంత్ (26)తో కలిసి శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దు పనిలో పడ్డాడు. కానీ, ధాటిగా ఆడే క్రమంలో పంత్ జయంత్ యాదవ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలాగే అక్షర్ పటేల్(9) కూడా నిరాశ పరిచి బోల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

అనంతరం హెట్ మెయిర్‌(15)తో కలిసి మరోసారి శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. కానీ, బుమ్రా అద్భుత బంతికి హెట్ మెయిర్ పెవిలియన్ చేరాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (33), అశ్విన్ (20) కీలక భాగస్వామ్యం నెలకొల్పి, మరో వికెట్ పడకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ముంబై బౌలర్లలో ట్రెండ్ బౌల్ట్, జయంత్ యాదవ్, పాండ్యా, నీల్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు కీలకమైన మ్యాచులో ముంబై ఇండియన్స్ టీం టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందు 130 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్లే ఆఫ్‌లో నిలవాలంటే మాత్రం ముంబై ఇండియన్స్ టీం కచ్చితంగా గెలవాల్సిందే. అయితే బ్యాటింగ్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. ‎ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీగా మలిచి మంచి ఊపులో కనిపించిన రోహిత్.. ఆ తరువాత అవేష్ ఖాన్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి చ్చిన సూర్య కుమార్‌తో కలిసి డికాక్ (19) ధాటిగానే పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నార్ట్జేకు క్యాచ్ డికాక్ పెవిలియన్ చేరాడు.

మరోవైపు సూర్య కుమార్ (33 పరుగులు, 26 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) మాత్రం ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్ మరోసారి ముంబై ఇండియన్స్‌ను దెబ్బ కొట్టాడు. రబాడాకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 68 పరుగుల వద్ద సూర్య కుమార్ వెనుదిరిగాడు. సౌరభ్ తివారి (15)తో కలిసి పొలార్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. కానీ, మరోసారి అక్షర్ పటేల్ అద్భుత బంతికి బోల్తా పడిన సౌరభ్ తివారి కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 80 పరుగుల నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత వెంట వెంటనే వికెట్లు కోల్పోతూ ముంబై ఇండియన్స్ టీం ఏ దశలోనూ కోలుకోలేక చతికిలపడింది. పొలార్డ్ 6, హార్దిక్ 17, నీల్ 1, జయంత్ యాదవ్ 11 పరుగులతో నిరాశ పరిచారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ తలో 3 వికెట్లు, నార్ట్జే, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: RR vs CSK Live Score in Telugu: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

MI vs DC, IPL 2021: పంత్ సేన టార్గెట్ 130.. ముంబై బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన ఢిల్లీ బౌలర్లు

'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..