AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti: ఈ కారు ధర రాయల్‌ ఎన్‌ఫీల్డ్ కంటే తక్కువ.. జీరో డౌన్‌ పేమెంట్‌.. 6 నెలల వారంటీ

Maruti: పొల్యూషన్ నుంచి బయటపడటానికి చాలామంది కారును కొనాలని అనుకుంటారు.. కానీ బడ్జెట్‌ సరిపోకపోవడం వల్ల కొనలేకపోతారు. అందుకే ఈ రోజు చౌకైన కారు

Maruti: ఈ కారు ధర రాయల్‌ ఎన్‌ఫీల్డ్ కంటే తక్కువ.. జీరో డౌన్‌ పేమెంట్‌.. 6 నెలల వారంటీ
Maruti Car
uppula Raju
|

Updated on: Oct 02, 2021 | 5:25 PM

Share

Maruti: పొల్యూషన్ నుంచి బయటపడటానికి చాలామంది కారును కొనాలని అనుకుంటారు.. కానీ బడ్జెట్‌ సరిపోకపోవడం వల్ల కొనలేకపోతారు. అందుకే ఈ రోజు చౌకైన కారు గురించి తెలుసుకుందాం. ఇది 5 సీట్ల కారు. అంతేకాదు దీని ధర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ కంటే తక్కువ. అదే మారుతి ఆల్టో కారు. ఇది కంపెనీలో అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్ కారు. తక్కువ ధర, అధిక మైలేజ్ కారణంగా మధ్య తరగతి ప్రజలకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ కొన్ని మార్పులు చేయడం ద్వారా పాత ఆల్టో మోడల్‌ని పరిచయం చేసింది. కార్స్ 24 అనే వెబ్‌సైట్ నుంచి మారుతి ఆల్టోను కేవలం రూ.1,25,984 కి కొనుగోలు చేయవచ్చు.

కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఈ కారు 10 ఫోటోలు ఉన్నాయి. ఇందులో కారును అన్ని కోణాల నుంచి చూపించే ప్రయత్నం చేశారు. ధర రూ.1,25,984 నిర్ణయించారు. ఈ కారు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌తో కేవలం రూ .2,997 నెలవారీ వాయిదాతో కొనుగోలు చేయవచ్చు. Cars24 వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. దీన్ని మీ ఇంటివద్దనే ఉచితంగా పొందవచ్చు. ఉచిత RC బదిలీ, ఉచిత 6 నెలల వారంటీ, థర్డ్ పార్టీ బీమా ఉచితంగా లభిస్తాయి.

ఇది సెకండ్ హ్యాండ్ కారు. థర్డ్ పార్టీ బీమా అక్టోబర్ 2022 వరకు చెల్లుతుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చిన ఈ కారు 64,692 కి.మీ. నడిచింది. పెట్రోల్ వేరియంట్‌ కారు. ఇది 2011లో కొనుగోలు చేశారు. మారుతి ఆల్టో గురించి మాట్లాడుతూ.. కారులో డ్రైవర్ కోసం ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ ఇచ్చారు. దీనికి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఇవ్వబడింది. అలాగే వెనుక ప్యానెల్‌లో పార్కింగ్ సెన్సార్‌లు ఇచ్చారు. ఇందులో 35 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. మీరు కారు కొనాలంటే Cars24 వెబ్‌సైట్‌ సందర్శించి సరైన నిర్ణయం తీసుకోండి.

గమనిక: ఇది కేవలం Cars24 వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం మాత్రమే. దీంతో tv9కి ఎటువంటి సంబంధం లేదని గుర్తించండి.

Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం.. 26 ఏళ్లుగా జరుగుతున్న పనులు.. ఎక్కడో తెలుసా..?

Samantha – Naga Chaithanya: అవును.. వారిద్దరి నిర్ణయం వ్యక్తిగతమే.. ఫ్యాన్స్ హృదయాలు శోకసంద్రమే..

Akkineni : అక్కినేని ఫ్యామిలిలో స్క్రీన్‌ మీదకు వచ్చిన నటీ- నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లే.. వివరాలు ఇక్కడ