AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహీంద్రాకి పోటీగా టాటా.. అదిరే రేంజ్​తో ఎలక్ట్రిక్​ SUV.. అసలు ట్విస్ట్​ ఏంటంటే

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే Tiago EV, Tigor EV, Punch EV, Nexon EV, Harrier EV వంటి మోడళ్లతో విస్తృతమైన ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న టాటా.. ఇప్పుడు మరో కీలక మోడల్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే Tata Safari EV. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఎలక్ట్రిక్ SUV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగంలో అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది విడుదలైతే టాటా నుంచి వచ్చిన తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా నిలిచే అవకాశం ఉంది.

మహీంద్రాకి పోటీగా టాటా.. అదిరే రేంజ్​తో ఎలక్ట్రిక్​ SUV.. అసలు ట్విస్ట్​ ఏంటంటే
Tata Safari Ev
Nikhil
|

Updated on: Nov 01, 2026 | 8:30 PM

Share

ప్రస్తుతం భారత మార్కెట్లో 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో Mahindra XEV 9S వంటి మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో Safari EVని తీసుకురావడం ద్వారా ఈ విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని టాటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త SUV ఇప్పటికే పలుమార్లు రోడ్లపై పరీక్షల సమయంలో కనిపించింది. అయితే విడుదల తేదీ, ధర, పూర్తి సాంకేతిక వివరాలపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

75kWh బ్యాటరీ..

Tata Safari EVకు సంబంధించిన బ్యాటరీ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUVని Acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించే అవకాశం ఉంది. ప్రస్తుతం Harrier EVలో అందిస్తున్న బ్యాటరీ ప్యాక్‌లనే ఇందులోనూ ఉపయోగించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇందులో 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లతో పాటు 80kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉండొచ్చని సమాచారం. 75kWh బ్యాటరీతో కూడిన రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా.

డిజైన్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెట్రోల్, డీజిల్ Safari మోడళ్లకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇంటీరియర్‌లో మాత్రం పలు మార్పులు ఉండొచ్చు. Harrier EV తరహాలో ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్‌ను అందించే అవకాశం ఉంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌లను కూడా తీసుకురావచ్చని తెలుస్తోంది.

ADAS, 540 డిగ్రీల కెమెరా..

ఫీచర్ల విషయానికి వస్తే Safari EVలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. అలాగే 540 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, లెవెల్ 2 ADAS, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లను కూడా అందించవచ్చని అంచనా.

ధర విషయానికి వస్తే Tata Safari EV ప్రారంభ ధర సుమారు రూ.20 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.32 లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం Mahindra XEV 9S ప్రారంభ ధర రూ.20.65 లక్షలుగా ఉండగా, MG Hector Tomahawk EV ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ఈ మోడళ్లకు పోటీ ఇచ్చేలా టాటా తన కొత్త ఎలక్ట్రిక్ SUV ధరలను నిర్ణయించే అవకాశం ఉంది. అయితే అధికారిక ధరలు, వేరియంట్లు, బ్యాటరీ సామర్థ్యం వంటి వివరాలు విడుదల సమయంలోనే స్పష్టమవుతాయి.

Follow Us