AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఫోల్డబుల్​ ఫోన్‌ ధరతో పిచ్చెక్కిస్తున్న శాంసంగ్​.. ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం గ్యారెంటీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Samsung చైనా టెలికాం భాగస్వామ్యంతో తన కొత్త లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Samsung W27ను అధికారికంగా విడుదల చేసింది. ‘Heart to the World’ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ముఖ్యంగా బిజినెస్, ప్రీమియం వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఈ డివైజ్ Galaxy Z Fold 8 Ultra ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైనట్లు సమాచారం.

కొత్త ఫోల్డబుల్​ ఫోన్‌ ధరతో పిచ్చెక్కిస్తున్న శాంసంగ్​.. ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం గ్యారెంటీ
Samsung W27
Nikhil
|

Updated on: Nov 01, 2026 | 8:40 PM

Share

Samsung W27లో 8 అంగుళాల ప్రధాన ఫోల్డింగ్ డిస్‌ప్లేతో పాటు 6.5 అంగుళాల కవర్ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 16GB RAM, గరిష్ఠంగా 1TB స్టోరేజ్ ఆప్షన్ ఉంది. Android 17 ఆధారిత One UI 9తో పనిచేసే ఈ ఫోన్‌లో Galaxy AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా Tiantong శాటిలైట్ నెట్‌వర్క్ సపోర్ట్ ద్వారా సాధారణ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ శాటిలైట్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునే అవకాశం కల్పించారు. భారీ ఫోల్డబుల్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, 200MP కెమెరా వంటి ఫీచర్లతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్‌ను కూడా అందించారు. దీంతో సాధారణ ఫోల్డబుల్ ఫోన్లకు భిన్నంగా ప్రత్యేక ఫీచర్లతో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చింది.

8 అంగుళాల AMOLED డిస్‌ప్లే..

Samsung W27లో 8 అంగుళాల QXGA+ Dynamic AMOLED 2X ప్రధాన డిస్‌ప్లేను అందించారు. ఇది 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్‌తో పాటు 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. బయట భాగంలో 6.5 అంగుళాల FHD+ Dynamic AMOLED 2X కవర్ డిస్‌ప్లే ఉంది. దీనికి Corning Gorilla Glass Ceramic 3 రక్షణ కల్పించారు.

పెర్ఫార్మెన్స్ కోసం 3nm Snapdragon 8 Elite Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో పాటు Adreno 840 GPUని ఉపయోగించారు. ఇందులో 16GB RAMతో పాటు 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. Android 17 ఆధారిత One UI 9పై పనిచేసే ఈ ఫోన్‌లో Instant Search, Live Translation వంటి Galaxy AI టూల్స్ అందించారు. భద్రత కోసం Samsung Knox ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు.

కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ సెటప్ ఉంది. టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 30x Space Zoomకు సపోర్ట్ చేస్తుంది. లోపలి, బయటి డిస్‌ప్లేలపై 10MP ఫ్రంట్ కెమెరాలను ఇచ్చారు. ఈ కెమెరా వ్యవస్థ 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

శాటిలైట్ కాలింగ్ ప్రత్యేకత

Samsung W27లో 5,000mAh బ్యాటరీని అందించారు. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డిజైన్ విషయానికి వస్తే రెడ్, బ్లూ వంటి రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫ్రేమ్, హింజ్, కెమెరా హౌసింగ్, లెన్స్ రింగ్స్‌కు గోల్డ్ ఫినిష్ ఇచ్చారు. వెనుక భాగంలో ‘Heart to the World’ ప్రత్యేక లోగోను ముద్రించారు. నీటి నుంచి రక్షణ కోసం IP48 రేటింగ్ కూడా ఉంది.

ఈ ఫోన్‌లో Tiantong శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంబంధిత సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులకు ఏడాది పాటు డైరెక్ట్ శాటిలైట్ నెట్‌వర్క్ యాక్సెస్‌తో పాటు 300 నిమిషాల శాటిలైట్ వాయిస్ కాల్స్, 100 శాటిలైట్ టెక్స్ట్ మెసేజ్‌లు లభిస్తాయి.

ధర విషయానికి వస్తే చైనాలో 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 18,999 యువాన్లు (సుమారు రూ.2,71,455)గా ఉంది. 16GB RAM + 1TB వేరియంట్ ధర 21,999 యువాన్లు (సుమారు రూ.3,14,250). రిజర్వేషన్ సమయంలో నమోదు చేసుకునే కస్టమర్లకు 1,399 యువాన్ల విలువైన Samsung Care+ ప్రీమియం సర్వీస్ ప్యాకేజీని అందిస్తున్నారు. ఇందులో డిస్‌ప్లే రీప్లేస్‌మెంట్‌పై డిస్కౌంట్, బ్యాటరీ రీప్లేస్‌మెంట్, డైరెక్ట్ రీప్లేస్‌మెంట్ సర్వీస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

Follow Us