Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ నుంచి రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? అసలు విషయం చెప్పిన కౌశల్.. వీడియో
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నుంచి టాప్ కంటెస్టెంట్ రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై అతని అభిమానులు భగ్గుమంటున్నారు. బిగ్ బాస్ తో పాటు హోస్ట్ నాగార్జునపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయంపై ఒక వీడియో రిలీజ్ చేశాడు కౌశల్.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఉత్కంఠగా సాగుతోంది. ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా టాప్ కంటెస్టెంట్ గా ఉన్న రోహిత్ నాయుడుని ఎలిమినేట్ చేశారన్న వార్త ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ముఖ్యంగా రోహిత్ అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ నిర్ణయంపై అలాగే హోస్ట్ నాగార్జునపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ హౌస్ పై దాడులు కూడా చేస్తామని కొందరు రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా కొందరు రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయిపోయారంటే.. మరికొంత మంది సీక్రెట్ రూమ్‌లో ఉంచారని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరైతే రోహిత్ కు సీక్రెట్ రూమ్‌కి పంపించేందుకు ఆఫర్ ఇవ్వగా దానిని తిరస్కరించి బయటకు వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇలా రోహిత్ ఎలిమినేషన్ కు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తుండడంతో అసలు ఏం జరిగిందో తెలియక అభిమానులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఎలిమినేషన్‌పై నటుడు, బిగ్‌బాస్ మాజీ విన్నర్ కౌశల్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఇలా చెప్పుకొచ్చాడు కౌశల్.
‘ఉదయం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వరుసపెట్టి మెసేజ్‌లు.. రోహిత్ గురించి చెప్పమని అంటున్నారు. ఈ విషయంలో నేను చెప్పేది ఒక్కటే. ఇప్పుడు బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ రోహిత్ ఎలిమినేట్ అవ్వాలంటే సహజంగా ఆడియన్స్ ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలాంటివి రేర్‌గా అప్పుడప్పుడు అవుతుంటాయి. కంటెస్టెంట్స్ ఓట్ల ప్రకారం రోహిత్‌ని ఎలిమినేట్ చేసినా .. ట్రంప్ కార్డ్ లాంటి రోహిత్‌ని బయటికి పంపించరు. ఒకవేళ రోహిత్ స్టేజ్ మీదకి వెళ్లి సీక్రెట్ రూమ్‌కి వెళ్లినా కూడా.. ఒకవేళ రోహిత్ నేను సీక్రెట్ రూమ్‌కి వెళ్లను. నాకు ఈ షో వద్దు, మీరు వద్దు .. అని చెప్పినా, తను రాసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ బ్రేక్ చేసి వెళ్లాలి తప్పించి బిగ్‌బాస్‌కైతే అలాంటి ఆలోచన ఉండదు. ఇక్కడే అందరూ ఒక విషయం గమనించాలి. రోహిత్ నిజంగా బిగ్‌బాస్ రూల్స్‌ని అతిక్రమించి బయటకు వెళ్లిపోతే.. తర్వాత బిగ్‌బాస్ వాళ్లు లీగల్‌గా అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
‘బిగ్‌బాస్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మాత్రమే కంటెస్టెంట్స్ బయటకు వెళ్లాలి. అంతే తప్పించి ఎవరికి వారుగా బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. 2008లో నాకు కూడా ఇలాగే బిగ్‌బాస్ హౌస్ లో రెడ్‌కార్డ్ ఇచ్చారు. దాంతో నన్ను ఎలిమినేట్ చేశారని అనుకున్నారు. ఆ టైమ్ లో నా ఫ్యాన్స్ బిగ్‌బాస్ హౌస్ వద్ద పెద్ద రచ్చ చేశారు. కొందరు బిగ్ బాస్ హౌస్ పై రాళ్లు కూడా వేశారు. ఈ హంగామాతో మేం భయపడిపోయి ఒక టేబుల్ కింద దాక్కున్నాం. నాకు తెలిసినంత వరకు రోహిత్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్‌ను ఎలిమినేట్ చేయరు.. కానీ బై ఛాన్స్ అతనిని పంపిస్తే మాత్రం బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి అవుతుంది’ అని కౌశల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
రోహిత్ ఎలిమినేషన్ పై కౌశల్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




