AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ కీలక నిర్ణయం.. 46 రోజుల్లో 30 లక్షల భారతీయుల ఖాతాల బ్యాన్.. కారణం అదేనా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 20 లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్ చేసింది. గత ఆగస్టు నెలలో ఇండియన్ అకౌంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Whatsapp: మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ కీలక నిర్ణయం.. 46 రోజుల్లో 30 లక్షల భారతీయుల ఖాతాల బ్యాన్.. కారణం అదేనా?
Whats App
Balaraju Goud
|

Updated on: Oct 02, 2021 | 5:21 PM

Share

Whatsapp Accounts Banned: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 20 లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్ చేసింది. గత ఆగస్టు నెలలో ఇండియన్ అకౌంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. ఆయా అకౌంట్లను బ్యాన్ చేసినట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. వాట్సప్ చాట్ ను అసాంఘీక పనుల కోసం, ఇతరులకు హాని కలిగించే కంటెంట్ ను పంపించడం లాంటి ఇష్యూలను దృష్టిలో పెట్టుకొని వారి ఖాతాలను నిలిపివేస్తున్నట్లు వాట్సప్ పేర్కొంది.

గత ఆగస్టు నెలలో 20,70,000 అకౌంట్లను బ్యాన్ చేసింది. అందులో 222 అకౌంట్ల యూజర్లు తిరిగి అప్పీల్ చేసుకున్నారు. ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి కూడా కొన్ని అకౌంట్ల బ్యాన్ పై అప్పీల్ వచ్చినట్టు సంస్థ వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా.. వాట్సప్ లో ఉన్న ఓ టూల్ ఆధారంగా.. హానికరమైన బిహేవియర్ ఉన్న అకౌంట్లను బ్యాన్ చేసింది. అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ ల ద్వారా, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా అకౌంట్లను టూల్ గుర్తిస్తుంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనేది యూజర్ రిపోర్ట్ చేసి బ్లాక్ చేసినప్పుడు సంబంధిత అకౌంట్ ను టూల్ అనలైజ్ చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా గత జులైలో వాట్సప్ బ్యాన్ చేసిన అకౌంట్లలో 25 శాతం ఇండియాకు చెందిన అకౌంట్లే కావడం విశేషం. ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల అకౌంట్లు బ్యాన్ అయితే.. అందులో సుమారు 20 లక్షల అకౌంట్లు ఇండియా నుంచే ఉంటున్నాయని వాట్సప్ సంస్థ స్పష్టం చేసింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు వాట్సప్ 3,027,000 అకౌంట్లను బ్యాన్ చేయగా.. అందులో 2,011,000 అకౌంట్లను మే 15 నుంచి జూన్ 15 మధ్యలో బ్యాన్ చేసింది.

Read Also…  Retrospective tax: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ‘రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌’ రద్దు..! నోటిఫై చేసిన ఆర్థిక శాఖ