Retrospective tax: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ‘రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌’ రద్దు..! నోటిఫై చేసిన ఆర్థిక శాఖ

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంంది. వెనుకటి తేదీ నుంచి పన్ను అంటే ‘రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌’ చట్టాన్ని రద్దు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించింది.

Retrospective tax: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ‘రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌’ రద్దు..! నోటిఫై చేసిన ఆర్థిక శాఖ
Income Tax
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 02, 2021 | 5:02 PM

Retrospective tax: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంంది. వెనుకటి తేదీ నుంచి పన్ను అంటే ‘రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌’ చట్టాన్ని రద్దు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఉన్న వివాదాల పరిష్కారానికి నిబంధనల్ని నోటిఫై చేసింది. ఇదిలావుంటే, ఈ అంశానికి సంబంధించి కెయిర్న్‌ ఎనర్జీ, వొడాఫోన్‌ వంటి సంస్థలు ప్రభుత్వంపై న్యాయపోరాటానికి దిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంటోంది. అయితే, ఆ రెండు సంస్థలు భవిష్యత్తులో సర్కార్‌కు ఎలాంటి నష్టం తలపెట్టబోమని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ఇండెమ్నిటీ బాండ్‌’ సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీంతో పాటు బోర్డు తీర్మానాన్ని లేదా చట్టబద్ధమైన ధ్రువీకరణను పన్ను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఇప్పటి వరకు వివిధ దేశాల్లో, వివిధ న్యాయస్థానాలు, ఫోరంలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను వెనక్కి చేసుకోవాల్సి కేంద్రం సూచించింది.

ఈ నిబంధనలకు కట్టుబడితేనే.. 2012 రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌ చట్టం ప్రకారం విధించిన పన్నులను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ చట్టం కింద ఇప్పటి వరకు వసూలు చేసిన సొమ్మును తిరిగిస్తామని తెలిపింది. నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం.. చెల్లింపులకు 2-3 నెలల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే న్యాయస్థానాలు, ఫోరంలలో ఉన్న వ్యాజ్యాలను వెనక్కి తీసుకుంటామని తెలియజేస్తూ 45 రోజుల్లోగా అండర్‌టేకింగ్‌ సమర్పించాలని తెలిపింది. ఇది అందిన పక్షం రోజుల్లో ఆదాయ పన్ను విభాగం ప్రధాన కార్యదర్శి పన్ను క్లెయింలను రద్దు చేస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని పేర్కొంది. ఆ తర్వాత 60 రోజుల్లో ఇండెమ్నిటీ బాండ్ సహా ఇతర నిబంధనలను కంపెనీలు పూర్తి చేయాలని తెలిపింది. అనంతరం 30 రోజుల్లో కంపెనీలకు రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌ నుంచి ఉపశమనం కలిగిస్తున్నట్లు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేస్తారని పేర్కొంది. అక్కడి నుంచి 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి కంపెనీలకు చెల్లింపులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.

Read Also…  Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం.. 26 ఏళ్లుగా జరుగుతున్న పనులు.. ఎక్కడో తెలుసా..?

యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్