డ్రగ్స్ కేసు.. నటి సంజన అరెస్ట్
శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. సీసీబీ అధికారుల విచారణలో పలువురు కన్నడ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి
Bengaluru Drugs Case: శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. సీసీబీ అధికారుల విచారణలో పలువురు కన్నడ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే పలువురిని సీసీబీ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇక తాజాగా ఈ వ్యవహారంలో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన సీసీబీ, తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె స్నేహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇచ్చిన సమాచారంతో.. సంజన ఇంట్లో సోదాలు చేసిన సీసీబీ, ఆమెను అదుపులోకి తీసుకుంది. కాగా శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నటి సంజనా. నాలుగు రోజుల క్రితం రాగిణి ద్వివేదిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నటి రాగిణిని ఐదు రోజులు పోలీసుల విచారణ కోసం ఎసిసిఎం కోర్టు రిమాండ్‌కి అనుమతిని ఇచ్చింది. ఇక మరోవైపు ఈ కేసులో మలయాళ డిజైనర్ మోడల్ నియాజ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు, మాలీవుడ్‌లో డ్రగ్స్ సరఫరాపై కూడా వివరాలు సేకరిస్తున్నారు.
Read More:
వివాదంలో ‘ఐపీఎల్ యాంథమ్’.. లీగల్ యాక్షన్‌కి సిద్ధమైన రాపర్