సికింద్రాబాద్‌లో దారుణం.. పబ్లిక్ టాయిలెట్‌లో మహిళ మృతదేహం
సికింద్రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని బైబిల్ హౌస్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. టాయ్‌లెట్‌లో డెడ్‌బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు...
Woman’s Body : సికింద్రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని బైబిల్ హౌస్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. టాయ్‌లెట్‌లో డెడ్‌బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీఫుటేజీ ద్వారా మహిళను గుర్తించేపనిలో పడ్డారు. మహిళను ఎక్కడైనా చంపి…డెడ్‌బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారా..? లేక దుండగులు ఇక్కడే చంపివేశారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
మహిళ ఒంటిపైన దుస్తులు సరిగ్గా లేకపోవడంతో… అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా…ఈ మర్డర్ మిస్టరీని వెంటనే చేధిస్తామని పోలీసులు తెలిపారు.