Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ అధికారులు.. పలు ఆధారాల సేకరణ..

Pastor Praveen Case:  హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పాస్టర్‌ ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంపై సీఐడీ బృందం దర్యాప్తు చేపట్టింది.

  • uppula Raju
  • Publish Date - 9:22 am, Wed, 20 January 21
Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ అధికారులు.. పలు ఆధారాల సేకరణ..

Pastor Praveen Case:  హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పాస్టర్‌ ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంపై సీఐడీ బృందం దర్యాప్తు చేపట్టింది. అతడికి సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని బ్రహ్మానందపురం గ్రామంలో ప్రవీణ్‌ చక్రవర్తికి చెందిన ఇల్లు, విద్యా సంస్థల్లో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐడీ అధికారులు పలు విషయాలను వెల్లడించారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చేసిన వ్యాఖ్యలపై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఏ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చారు? ఎక్కడి విగ్రహాలు ఎలా ధ్వంసం చేశారన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎలక్ట్రానిక్‌ ఆధారాలు సేకరించామని, మరిన్ని ఆధారాలను సహ కుట్రదారులు దాచినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.

పూళ్ల గ్రామంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 28 కి చేరిన వ్యాధిగ్రస్థులు.. స్పందించిన మంత్రి ఆళ్లనాని ఏం చెప్పారంటే..