Paul Dinakaran: చెన్నైలో ఐటీ దాడులు.. క్రైస్తవ ప్రచారకుడు పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు..
Paul Dinakaran: తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 200 మంది ఆదాయపన్ను
Paul Dinakaran: తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 200 మంది ఆదాయపన్నుశాఖ అధికారులు తమిళనాడులోని 28 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ ప్రచారకుడు పాల్ దినకరన్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కారుణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, జీసెస్ కాల్స్ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేత, విదేశాల్లో పెట్టుబడులపై ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ శాఖ తెలిపింది.
Kgf chapter 2 climax : కేజీఎఫ్ క్లైమాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..