Hyderabad: కేబీఆర్ పార్క్ దగ్గర మరో ఘటన.. నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిపై మరో కేసు..
Chaurasia Case: హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు దగ్గర సినీనటి షాలూ చౌరాసియాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్
Chaurasia Case: హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు దగ్గర సినీనటి షాలూ చౌరాసియాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు అనతికాలంలోనే నిందితుడు కొమ్ముబాబును అరెస్ట్ చేశారు. కాగా.. ఈ ఘటన భాగ్యనగరంలో కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీనటి షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన నిందితుడే ఈనెల 2న కేబీఆర్ పార్క్ వద్ద మరో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా డబ్బులు ఇవ్వకుంటే లైంగిక దాడికి పాల్పడతానంటూ బెదిరించి తన దగ్గరున్న రూ.2,500 లాక్కున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ని రోజులు భయంతో ఫిర్యాదు చేయలేదని.. నిందితుడు అరెస్టు కావడంతో ధైర్యంతో ఫిర్యాదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు అనంతరం క్రిష్ణానగర్‌కు చెందన నిందితుడు కొమ్ముబాబుపై మరో కేసు నమోదు చేసినట్లు బంజారాహీల్స్ పోలీసులు తెలిపారు.
కాగా.. ఈ నెల 14న టాలీవుడ్ నటి చౌరాసియాపై దాడి కేసులో.. నిందితుడు కొమ్ము బాబును బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో లైట్‌బాయ్‌గా పనిచేస్తున్న కొమ్ము బాబు కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో అతనిపై విజయవాడ, బంజారాహిల్స్, గోల్కొండ పోలీసు స్టేషన్లల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. గోల్కొండ స్టేషన్‌లో నమోదైన కేసులో జైలుకు కూడా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: