Ramagundam: అందరూ చూస్తుండగానే ప్రాణం తీసుకున్నాడు.. స్టేషన్‌లోనే రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

Man Commits Suicide: ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువకుడు రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైన్‌ వస్తుండగా ప్లాట్‌ఫామ్‌ నుంచి ట్రాక్‌పైకి దూకాడు. ట్రైన్‌కు ఎదురు నిలబడి

Ramagundam: అందరూ చూస్తుండగానే ప్రాణం తీసుకున్నాడు.. స్టేషన్‌లోనే రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..
Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2021 | 9:09 PM

Man Commits Suicide: ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువకుడు రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైన్‌ వస్తుండగా ప్లాట్‌ఫామ్‌ నుంచి ట్రాక్‌పైకి దూకాడు. ట్రైన్‌కు ఎదురు నిలబడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని కైరాకు చెందిన సంజయ్‌ కుమార్‌ (27) అనే యువకుడు.. తన తాతతో కలిసి హైదరాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్న సంజయ్‌కు కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా మతి స్థిమితం లేకుండా సంచరిస్తున్న సంజయ్‌ ఈ రోజు హైదరాబాద్‌ నుంచి రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వేళ ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న రాజధాని రైలు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ తెలిపారు. రైలు వస్తున్న క్రమంలో పట్టాలపైకి దూకిన సంజయ్.. దానికి ఎదురుగా నిలబడి ప్రాణం తీసుకున్నాడు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు వస్తుందని ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా.. పట్టాలపై రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:

Marriage: ప్రసాదం ఇవ్వడానికి వెళితే పెళ్లి చేశారు.. తుపాకీ గురిపెట్టి బలవంతంగా..

Mortuary Freezer: చనిపోయాడనుకొని మార్చురీ ఫ్రీజర్‌లో పెట్టారు.. 7 గంటల తర్వాత చూస్తే సీన్‌ రివర్స్‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!