Mortuary Freezer: చనిపోయాడనుకొని మార్చురీ ఫ్రీజర్‌లో పెట్టారు.. 7 గంటల తర్వాత చూస్తే సీన్ రివర్స్..
Dead man found alive: అతను మరణించాడని.. ఆసుపత్రి సిబ్బంది మార్చురీకి తరలించారు. అయితే.. ఆ వ్యక్తిని పోస్టుమార్టం నిర్వహించేందుకు ముందుగా ఫ్రీజర్ బాక్సులో
Dead man found alive: అతను మరణించాడని.. ఆసుపత్రి సిబ్బంది మార్చురీకి తరలించారు. అయితే.. ఆ వ్యక్తిని పోస్టుమార్టం నిర్వహించేందుకు ముందుగా ఫ్రీజర్ బాక్సులో ఉంచారు. చివరకు అతను కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. మళ్లీ తిరొగొచ్చాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరాదాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే శ్రీకేశ్ కుమార్ బైక్‌పై వెళ్తుండగా గురువారం రాత్రి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతన్ని మొరాదాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అర్ధరాత్రి కావడంతో అతని మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం ఫ్రీజర్‌లో ఉంచారు. దాదాపు ఏడు గంటలపాటు అతను కొన ఊపిరితో ఫ్రిజర్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంచనామా నిర్వహించే కుటుంబసభ్యుల సంతకం కావాల్సి ఉండటంతో.. వారు శ్రీకేశ్ కుమార్‌ను తమకొకసారి చూపించాలని అడిగారు.
దీంతో కుటుంబసభ్యులను మార్చురీకి తీసుకెళ్లారు. అయితే.. ఫ్రిజర్‌లో ఉన్న శ్రేకేష్ కుమార్ కదులుతుండటంతో అందరు ఆశ్చర్యపోయారు. వెంటనే బాధితుడి కుటుంబసభ్యులు అతను చనిపోలేదంటూ వైద్యులకు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే అతన్ని పరీక్షించిన వైద్యసిబ్బంది చికిత్స మొదలు పెట్టారు. ప్రస్తుతం కుమార్ మీరట్‌లోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నాడని.. పరిస్థితి మెరుగుపడినట్లు మొరాదాబాద్ చీఫ్ మెడికల్ సూపరిండెంట్ డా.శివ్ సింగ్ తెలిపారు.
ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్.. తెల్లవారు జామున 3గంటల సమయంలో పూర్తిగా పరిక్షించి చనిపోయినట్లు నిర్దారించారని ఆయన తెలిపారు. మరుసటి రోజు పోలీసులు, కుటుంబ సభ్యులు బతికి ఉన్నట్లు గుర్తించారని.. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. ప్రాణాలు కాపాడటానికే తాము పనిచేస్తున్నామని.. డా.శివ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: