Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఓ మై గాడ్’.. వాటర్ లేకుండా ఓన్లీ ఫాంటాతో మ్యాగీ.. ఎగబడుతోన్న ఫుడ్ ప్రియులు

విభిన్న రకాల ఫుడ్స్‌ను తినడానికి చాలామంది ఇష్టపడతారు. మనిషి.. మనిషికి ఆహారపు అలవాట్ల విషయంలో విభిన్నత ఉంటుంది. కొందరు ఇండియన్ ఫుడ్ ఇష్టపడితే, ఇంకొందరు ఇటాలియన్, చైనీస్ ఫుడ్ ఇష్టపడతారు.

Viral Video: 'ఓ మై గాడ్'.. వాటర్ లేకుండా ఓన్లీ ఫాంటాతో మ్యాగీ.. ఎగబడుతోన్న ఫుడ్ ప్రియులు
Fanta Maggi
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2021 | 6:05 PM

విభిన్న రకాల ఫుడ్స్‌ను తినడానికి చాలామంది ఇష్టపడతారు. మనిషికి.. మనిషికి ఆహారపు అలవాట్ల విషయంలో విభిన్నత ఉంటుంది. కొందరు ఇండియన్ ఫుడ్ ఇష్టపడితే, ఇంకొందరు ఇటాలియన్, చైనీస్ ఫుడ్ ఇష్టపడతారు. పప్పు, ఆవకాయ, గొంగూరకు మించిన టేస్టీ ఫుడ్ మరొకటి ఉండదు అనేవారు కూడా ఉంటారు. అయితే కొత్త.. కొత్త వంటకాలను టేస్ట్ చేయాలనే ఆరాటపడేవారు నిత్య జీవితంలో మనకు తారసపడుతూనే ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన వంట ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూశాక మీరు ‘ఓ మై గాడ్’ అనడం ఖాయం. మ్యాగీ మీలో చాలామంది తిని ఉంటారు. కానీ ఫాంటా మ్యాగీ మీరు ఎప్పుడైనా తిన్నారా.. అసలు విన్నారా..?. దాని గురించి తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

2 నిమిషాల్లో తయారయ్యే వంటకం ‘మ్యాగీ’ అని స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. దీని రుచిని చాలామంది ఆస్వాదిస్తారు.  మ్యాగీతో ప్రయోగాలు చేసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. పాలతో మ్యాగీ  చేయడం, మ్యాగీతో పానీ పూరి తినడం వంటి వీడియోలను ఇటీవల కాలంలో చూశాం. తాజాగా ‘ఫాంటా మ్యాగీ’ వీడియో ఒక నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. ముందుగా వీడియో వీక్షించండి.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యక్తి ఒక బాండీలో నెయ్యి వేశాడు. ఆపై కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమోటాలను అందులో వేశాడు. అవి లైట్‌గా వేగిన తర్వాత.. అందులో ఫాంటా పోశాడు. ఆపై మ్యాగీకి కావాల్సిన మసాలాలను కలిపాడు. దీంతో 2 నిమిషాల్లోనే ఫాంటా మ్యాగీ తయారైంది. ఆపై చాట్ మసాలా చల్లి… నిమ్మకాయ పిండి వేడివేడిగా కస్టమర్‌కి సర్వ్ చేశాడు. ఈ క్రేజీ మ్యాగీని టేస్ట్ చేసేందుకు భోజన ప్రియులు అక్కడికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ వంటకం ఆ ఏరియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కొంతమంది ఇదేం మ్యాగీ రా బాబు అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు దీన్ని మేము కూడా దీన్ని ట్రై చేస్తాం అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Telangana: బైక్​పై వెళ్తుండగా ఆగిన గుండె.. క్షణాల్లోనే ఊపిరి పోయిన వైనం.. Watch Video

మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..