Telangana: బైక్​పై వెళ్తుండగా ఆగిన గుండె.. క్షణాల్లోనే ఊపిరి పోయిన వైనం.. Watch Video

అదేంటో తెలియదు కానీ ఈ మధ్య తక్కువ వయసులో చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నవారు క్షణాల్లో విగత జీవులగా మారిపోతున్నారు.

Telangana: బైక్​పై వెళ్తుండగా ఆగిన గుండె.. క్షణాల్లోనే ఊపిరి పోయిన వైనం.. Watch Video
Tragedy
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2021 | 4:10 PM

అదేంటో తెలియదు కానీ ఈ మధ్య తక్కువ వయసులో చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నవారు క్షణాల్లో విగత జీవులగా మారిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం కూడా ఉండటం లేదు. ఆపదలో ఉన్నవారిని బ్రతికించుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు కూడా కుదరడం లేదు. క్షణాల్లోనే ఊపిరి పోతుంది. తాజాగా  అస్వస్థతకు గురైన యువకుడిని చికిత్స కోసం బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా… మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పండ్ల రాజు(26) అనే యువకుడు ఉన్నట్లుండి ఉదయం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు. గుండెపోటు వచ్చినట్లు ఈసీజీలో డాక్టర్లు గుర్తించారు.

మెడిసిన్ తీసుకున్న అనంతరం ఇంటికి వెళ్లిన రాజు విశ్రాంతి తీసుకోగా… మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతని ఫ్రెండ్ బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా… గాంధీ చౌరస్తా వద్ద అచేతనంగా బైక్‌పై నుంచి పడిపోయాడు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిసింది. జరిగిన సంఘటన తాలుకా దృశ్యం సీసీ కెమెరాలో రికార్డవడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Also Read: మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..

తెలంగాణ సర్కార్ నిర్ణయంపై తెలుగు సినీ ప్రముఖుల హర్షం.. సీఎంపై ప్రశంసలు