AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ సర్కార్ నిర్ణయంపై తెలుగు సినీ ప్రముఖుల హర్షం.. సీఎంపై ప్రశంసలు

తెలంగాణ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంపై తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువరు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం ఎంతో గొప్పదని సోషల్ మీడియా వేదికగా సీఎంను ప్రశంసిస్తున్నారు.

Telangana: తెలంగాణ సర్కార్ నిర్ణయంపై తెలుగు సినీ ప్రముఖుల హర్షం.. సీఎంపై ప్రశంసలు
Nani Ram Samantha
Ram Naramaneni
|

Updated on: Nov 21, 2021 | 6:56 PM

Share

తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మొదలైన కేసీఆర్ రైతు ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లింది. రాష్ట్రంలో యాసంగిలో ధాన్యం కొంటరా? లేదా? అన్నది కేసీఆర్ సర్కారు స్ట్రట్ క్వశ్చన్. రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతించిన సీఎం కేసీఆర్.. అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చనిపోయిన ప్రతీ రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం.. 750 మంది రైతు కుటుంబాలకు కేంద్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ ప్రముఖుల వరకు సీఎం ఉదారతను అభినందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్‌ సాయం ప్రకటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించడం గర్వంగా ఉందన్నారు.

కేటీఆర్ ట్వీట్‌కు రీట్వీట్‌ చేసిన ప్రకాశ్ రాజ్ కేసీఆర్ ప్రకటనను అభినందించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ మోదీ సారీ చెప్తే సరిపోదు. చనిపోయిన కుటుంబాల బాధ్యత తీసుకోవాలంటూ ప్రకాశ్ రాజ్ గుర్తు చేశారు.

కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన నటి సమంత.. ధన్యవాదాలు తెలిపారు.

అటు హీరోలు నాని, రామ్‌లు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అభినందించారు. రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు.

Also Read: Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్య పరిస్థితిపై గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్