Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్య పరిస్థితిపై గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

విలన్‌గా వికటాట్టహాసం చేసినా, క్యారెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించినా అది కైకాల స‌త్యనారాయ‌ణ‌కే చెందుతుంది.

Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్య పరిస్థితిపై గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
Kaikala Satyanarayana Chira
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2021 | 12:17 PM

కైకాల సత్యనారాయణ.. పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో వందల సినిమాల్లో, విభిన్న పాత్రలు పోషించారు. విలన్‌గా వికటాట్టహాసం చేసినా, క్యారెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించినా అది కైకాల స‌త్యనారాయ‌ణ‌కే చెందుతుంది. దాదాపు ఆరు ద‌శాబ్ధాలుగా ప్రేక్షకుల‌ని అల‌రించిన ఆయ‌న.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో అభిమానుల్లో ఆందోళన నెలకుంది. తాజాగా కైకాల ఆరోగ్యంపై గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సృహలోకి వచ్చారని తెలిపారు. చికిత్స అందిస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సాయంతో కైకాలను పలకరించినట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలకుంటారన్న పూర్తి నమ్మకం కలిగిందని వెల్లడించారు. ట్రాకియాస్టోమి కారణంగా కైకాల మాట్లాడలేకపోయినా.. తాను పలుకరించినప్పుడు నవ్వుతూ థంప్స్ సైన్ చూపించారని చిరు పేర్కొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నానని.. ఈ విషయం అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మెగాస్టార్‌ ట్వీట్ చేశారు.

కైకాల ఆరోగ్య స్థితిపై చిరంజీవి ట్వీట్

ఇటీవలే కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరు త‌న‌ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.

Also Read: మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!