RRR : అగ్ర రాజ్యంలో అదరగొట్టనున్న ఆర్ఆర్ఆర్.. భారీ రికార్డ్ పై కన్నేసిన జక్కన్న..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రణం రౌద్రం రుధిరం.. బహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు జక్కన్న.
RRR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రణం రౌద్రం రుధిరం.. బహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు జక్కన్న. అంతటి ఘన విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసకరంగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే సామాన్యంగా అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ ఇది మల్టీస్టారర్.. చిన్న హీరోలు కూడా కాదు ఒకరు మెగాపవర్ స్టార్ మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సునీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాను ఎట్టి పరిస్థితిలో అనుకున్న తేదీకి విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అలాగే అగ్రరాజ్యం అయిన అమెరికాలో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. అక్కడ ఉన్న మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ గ్రాండ్ రిలీజ్ కానుంది. యూఎస్ లో సినిమార్క్ కు దాదాపుగా 350 మల్టీ ప్లెక్స్ లు ఉన్నాయి. వాటిలో 288 సినిమార్క్ మల్టీ ప్లెక్స్ ల్లో వెయ్యికి పైగా స్క్రీన్స్ ల్లో మొదటి మూడు రోజులు ఆర్ఆర్ఆర్ ఆడనుంది తెలుస్తుంది. అలాగే సినిమార్క్ థియేటర్లోనే కాకుండా ఇతర మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఈ సినిమాను స్క్రీనింగ్ చేయనున్నారట. అంతే కాదు యూఎస్ లో అయిదు భాషలకు సంబంధించిన షో లు ఉంటాయట.
మరిన్ని ఇక్కడ చదవండి ;