Pushpa: బాలీవుడ్‌లో భారీగా రిలీజ్ కానున్న బన్నీ సినిమా.. “పుష్ప” కోసం రంగంలో బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ..

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ.

Pushpa: బాలీవుడ్‌లో భారీగా రిలీజ్ కానున్న బన్నీ సినిమా.. పుష్ప కోసం రంగంలో బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ..
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2021 | 12:57 PM

Pushpa: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న కనిపించనుంది. ‘అల వైకుఠ‌పురంలో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి, ఏ బిడ్డ  పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల హిందీలో ఈ సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల హిందీలో పుష్ప ను విడుదల చేయబోవడం లేదు అంటూ ప్రచారం కూడా జరిగింది. దాంతో బన్నీ అభిమానులు నిరాశ పడ్డారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. పుష్ప సినిమాను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏఏ ఫిల్మ్స్   ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ పలు భారీ సినిమాను బాలీవుడ్ లో విడుదల చేశారు. బాహుబలి 2 , కేజీఎఫ్ లాంటి బడా సినిమాను హిందీలో విడుదల చేసింది ఏఏ ఫిల్మ్స్. ఇప్పుడు బన్నీ పుష్ప సినిమాను కూడా భారీగా అక్కడ ఏఏ ఫిల్మ్స్ విడుదల చేయనుంది. అత్యధిక థియేటర్ చైన్ వ్యవస్థ ఉన్న ఈ సంస్థ పుష్ప ను విడుదల చేసేందుకు సిద్దం అవ్వడంతో బన్నీ ఆర్మీ ఆనందంలో తేలిపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి ; 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్