Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

Hyderabad: గతంలో సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులను నియంత్రిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెం. 63ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారం సినిమా థియేటర్లు, మాల్స్‌తో పాటు...

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..
Parking Fee
Follow us

|

Updated on: Nov 21, 2021 | 7:26 AM

Hyderabad: గతంలో సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులను నియంత్రిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెం. 63ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారం సినిమా థియేటర్లు, మాల్స్‌తో పాటు మల్టీప్లెక్సుల్లో పార్కింగ్‌ ఫీజులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది చాలా రోజుల పాటు కొనసాగింది. అయితే థియేటర్ల యాజమాన్యాల అభ్యర్థన మేరకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో సినిమా థియేటర్లలో పార్కింగ్ రుసుంలను వసూలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ విషయమై పార్కింగ్‌ ఫీజులను నియంత్రిస్తూ తీసుకొచ్చి జీవో నెం. 63కు సవరణలు చేసింది.

థియేటర్‌ యాజమాన్యాల వెర్షన్‌ ప్రకారం.. థియేటర్లలోని పార్కింగ్‌ ప్రదేశాల్లో సినిమాకు వచ్చిన వారే కాకుండా ఇతర పనుల కోసం వచ్చిన వారు వారు కూడా పార్కింగ్‌ చేస్తున్నారని.. దీంతో వాహనాల పార్కింగ్‌, భద్రత విషయం సవాల్‌గా మారిందని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకునేందుకు అమతిచింది. ఈ విషయమై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది కేవలం థియేటర్లకు మాత్రమే వర్తిస్తుంది.. మల్టీప్లెక్సులు, మాల్స్‌లో ‘నో పార్కింగ్‌ ఫీజు’ నిబంధన యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: Monkey Viral Video: సైకిల్‌పై సరదగా బడికి వెళ్తోన్న వానరం.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్

9 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 550 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బౌలర్లపై విరుచుకపడిన ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌ ఎవరంటే?