Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రికార్డ్స్ వేటలో రెబల్ స్టార్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న “రాధేశ్యామ్” ఫస్ట్ సాంగ్..

చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా "రాధే శ్యామ్‌". ఈ సినిమా లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు

Radhe Shyam: రికార్డ్స్ వేటలో రెబల్ స్టార్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రాధేశ్యామ్ ఫస్ట్ సాంగ్..
Radheshyam
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2021 | 1:15 PM

Radhe Shyam: చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. ఈ సినిమా లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. ఇది గొప్ప ప్రేమ‌క‌థ అని మెష‌న్ పోస్ట‌ర్ తోనే రివీల్ అయ్యింది. మొనీమధ్య విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగింది. తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యంకాని రికార్డుల్ని రాధే శ్యామ్ తిరగరాసింది. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్. ఇక రీసెంట్ గా సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎవరో వీరెవరో అంటూ సాగే ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తుంది.

ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్‌ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక యూట్యూబ్ లో ఈ పాట సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కేవలం 5 రోజుల్లో ఈ పాట 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి ; 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్