Mike Tyson: మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..

బాక్సింగ్‌లో లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మైక్ టైసన్ జీవితంలో వివాదాలు కొత్తేమీ కాదు. అమెరికాలో జన్మించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మైక్ టైసన్ గురించి ఓ డార్క్ సీక్రెట్ బయటికి వచ్చింది.

Mike Tyson: మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..
Mike Tyson
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2021 | 12:01 PM

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు సంబంధించిన ఓ సీక్రెట్ బయటకు వచ్చింది. రింగులోకి దిగితే ప్రత్యర్థులను ఎక్కడ చంపేస్తానోనని టైసన్ భయపడేవాడట. అందుకని ఓ ట్రిక్కు పాటించేవాడట. ఇన్నాళ్లు రహస్యంగా ఉన్న ఆ ట్రిక్కు ఏంటనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తనలోని ఆవేశాన్ని, దూకుడును కొంత తగ్గించుకునేందుకు బౌట్‌కు ముందు శృంగారంలో పాల్గొనేవాడని మైక్‌ టైసన్ మాజీ బాడీగార్డ్ రూడీ గోంజాలెజ్ స్పష్టం చేశారు. 55 ఏళ్ల టైసన్ బాక్సింగ్ రింగ్‌లో ఎంతో దూకుడుగా ఉండేవాడు. తన ఆవేశాన్ని తగ్గించుకునేందుకు రింగ్‌లో దిగడానికి ముందు శృంగారంలో పాల్గొనేవాడని రూడీ చెప్పుకొచ్చాడు. అది కూడా ఒకరిద్దరితో కాదు, ఒకేసారి చాలామంది ఆడవాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లోనే సెక్స్ చేయడం చూశానని చెప్పుకొచ్చాడు. ఎందుకిలా చేస్తావని తాను ఓ సారి అడిగానని, అందుకు సమాధానం చెబుతూ.. నేను మ్యాచ్‌కి ముందు సెక్స్ చేయకపోతే, రింగ్‌లో నా ప్రత్యర్థిని చంపేస్తానేమో అనిపిస్తుందన్న భయంతో సెక్స్‌ చేస్తానని తెలిపాడని చెప్పొకొచ్చాడు. ఇప్పటికీ మైక్ టైసన్ ఫైట్ చేసిన కొందరు బాక్సర్లను చూస్తూ ఉంటానని, వారిలో చాలామంది ఎముకలు విరిగిపోయి, కోమాలో ఉన్నవాళ్లు కూడా ఉన్నారని తెలిపాడు గోంజాలెజ్.

బాక్సింగ్ కెరీర్‌లో 58 మ్యాచులు ఆడిన మైక్ టైసన్.. 50 విజయాలు అందుకున్నాడు. కేవలం ఆరు మ్యాచుల్లో మాత్రమే ఓటమి చవి చూశాడు. ప్రత్యర్ధులు లేకపోవడంతో మరో రెండు మ్యాచులు రద్దయ్యాయి. కెరీర్ ఆరంభంలో వరుసగా 37 మ్యాచులు గెలిచిన మైక్ టైసన్.. తన 38వ మ్యాచ్‌లో తొలి ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత 57, 58వ మ్యాచుల్లో వరుసగా ఓడిన తర్వాత 2005లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి వైదొలిగారు. 8 మంది పిల్లలకు తండ్రి అయిన మైక్ టైసన్, విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీలో నటిస్తున్నాడు.

Also Read: AP Weather: వెదర్ అప్‌డేట్.. ఏపీకి పొంచి ఉన్న మరో గండం