Kartikeya Gummakonda: అంగరంగ వైభవంగా “ఆర్ఎక్స్100” హీరో వివాహం.. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కార్తికేయ- లోహిత
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమైన హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ కుర్ర హీరో.
Kartikeya Gummakonda: ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమైన హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ కుర్ర హీరో. నటన పరంగా కార్తికేయ మంచి మార్కులు కొట్టేశాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇక హీరోగా మంచి సినిమాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలకు కూడా ఓకే చెప్తున్నాడు ఈ యంగ్ హీరో. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించి అలరించాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాణిస్తున్న కార్తికేయ ఇప్పుడు తమిళ్ లోనూ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో విలన్ గ కనిపించనున్నాడు కార్తికేయ.
ఇక ఈ కుర్ర హీరో తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను వివాహమాడాడు. ఇటీవల రాజా విక్రమార్క సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన లోహితకు ప్రపోజ్ చేశాడు కార్తికేయ. కార్తికేయ-లోహిత 2010లో మొదటిసారిగా కలుసుకున్నారు. వరంగల్ నిట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ కోర్సు చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. నేడు నవంబర్ 21(ఆదివారం)న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత మెడలో మూడు ముళ్ళు వేశాడు కార్తికేయ. ఈ పెళ్లి హైదరాబాద్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినిమా తారలు విచ్చేసి నవవదువరులను ఆశీర్వదించారు.
Hero @ActorKartikeya tied knot to #Lohitha today at 9.47 am amidst family, friends, wellwishers and fans
Congrats and a very happy married life to the new couple✨ pic.twitter.com/4r1ekuf3a8
— BA Raju’s Team (@baraju_SuperHit) November 21, 2021
మరిన్ని ఇక్కడ చదవండి ;