AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli-Mahesh: మహేష్‌ చిత్రం కోసం తమిళ స్టార్‌ హీరోను దింపనున్న రాజమౌళి.? విలన్‌ పాత్ర కోసమే..

Rajamouli - Mahesh: రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపజయం అంటూ ఎరగని రాజమౌళి తన సినిమాల్లో హీరోలను ఎంత గొప్పగా...

Rajamouli-Mahesh: మహేష్‌ చిత్రం కోసం తమిళ స్టార్‌ హీరోను దింపనున్న రాజమౌళి.? విలన్‌ పాత్ర కోసమే..
Rajamouli Mahesh Babu
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2021 | 2:10 PM

Rajamouli – Mahesh: రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపజయం అంటూ ఎరగని రాజమౌళి తన సినిమాల్లో హీరోలను ఎంత గొప్పగా చూపిస్తాడో విలన్లను కూడా అందే గొప్పగా చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే హీరో కంటే విలన్‌కు ఎక్కువగా బలవంతుడిగా చూపిస్తాడు అప్పుడే హీరో పాత్రకు క్రేజ్‌ పెరుగుతుందనేది జక్కన్న లాజిక్‌. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాల్లో విలన్‌పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌ బాబుతో తెరకెక్కనున్న సినిమా కోసం కూడా రాజమౌళి బలమైన విలన్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి రాజమౌళి ఏకంగా ఓ స్టార్‌ హీరోను రంగంలోకి దింపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను ఎవరో కాదు తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌. మహేష్‌ బాబుకు ధీటుగా ఉండేలా విలన్‌ పాత్ర ఉండాలనే ఉద్దేశంతోనే జక్కన్న విక్రమ్‌ను విలన్‌గా మార్చనున్నారని సమాచారం. విక్రమ్‌ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశాడన్న వార్తలు వస్తున్నాయి.

Vikram

ఇదిలా ఉంటే విక్రమ్‌ ఇంత వరకు తన కెరీర్‌లో విలన్‌గా నటించలేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో మహేష్‌ సరసన సమంత నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Good News: ఢిల్లీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. 10 ఏళ్లు దాటిన డీజిల్ వెహికల్స్‌పై కీలక నిర్ణంయం..!

Good News: ఢిల్లీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. 10 ఏళ్లు దాటిన డీజిల్ వెహికల్స్‌పై కీలక నిర్ణంయం..!

Happy Birthday Allu Arha: అల్లు అర్జున్ గారాలపట్టి అల్లరి పిల్ల అర్హ పుట్టిన రోజు నేడు..