Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: ఢిల్లీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. 10 ఏళ్లు దాటిన డీజిల్ వెహికల్స్‌పై కీలక నిర్ణంయం..!

రాజధాని ఢిల్లిలో EV విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వం, ఇప్పుడు 10 ఏళ్ల డీజిల్ నడిచే వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడానికి మార్గం సుగమం చేసింది.

Good News: ఢిల్లీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. 10 ఏళ్లు దాటిన డీజిల్ వెహికల్స్‌పై కీలక నిర్ణంయం..!
Delhi Vehicle
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 21, 2021 | 11:46 AM

Delhi 10 Year old Diesel Vehicles: దేశ రాజధాని ఢిల్లీ వాహనదారులకు శుభవార్త.. 10 ఏళ్ల వాహన యజమానులకు ఢిల్లీ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. రాజధానిలో EV విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వం, ఇప్పుడు 10 ఏళ్ల డీజిల్ నడిచే వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడానికి మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం, నిబంధనల ప్రకారం, ఢిల్లీలో డీజిల్ వాహనాల జీవితకాలం 10 సంవత్సరాలు, కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో కూడిన డీజిల్ వాహనాన్ని పదేళ్లకు పైగా నడుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఇందు కోసం సన్నాహాలు ప్రారంభించింది. అదే సమయంలో, సాంప్రదాయ లోకోమోటివ్‌లను ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో భర్తీ చేయడానికి రవాణా శాఖ ఎలక్ట్రిక్ కిట్ తయారీదారులను ఎంపానెల్ చేస్తుందని రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ గురువారం ప్రకటించారు.

గతేడాది ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) విధానం సబ్సిడీలకు అదనంగా ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందిస్తుందని రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. డీజిల్ వాహనాలను రీట్రోఫిట్ చేయడంతో ఆ వాహనాలను నిర్దేశించిన 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఎలక్ట్రిక్ వాహనాలుగా వినియోగించుకోవచ్చని గెహ్లాట్ తెలిపారు. EV పాలసీని ప్రారంభించిన సందర్భంగా ఆయయ మాట్లాడుతే.. ఢిల్లీలో కేవలం 46 ఎలక్ట్రిక్ లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCVలు) మాత్రమే ఉన్నాయని, అది ఇప్పుడు 1,054కి పెరిగిందన్నారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఈ-వాహనాల సంఖ్య 7 శాతానికి పైగా పెరిగిందన్నారు. ఈవీ పాలసీలో లక్ష్యం మేరకు 2024 నాటికి దీన్ని 25 శాతానికి పెంచుతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశం ప్రభుత్వానికి లభిస్తోందన్నారు. ఈ పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 250 రోడ్లపై ఎలక్ట్రిక్ లైట్ కమర్షియల్ వాహనాలను నో ఎంట్రీ సమయంలో అనుమతిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో, ఢిల్లీలో పెద్ద సంఖ్యలో 10 ఏళ్ల డీజిల్ వాహనాలు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు వాటిని ఢిల్లీలో నడపడానికి అనుమతించలేదు. నిబంధనల ప్రకారం ఈ వాహనాలు రోడ్డుపైకి వస్తే వాటిని సీజ్ చేస్తారు. అలాంటి వాహనాలను తిరిగి నడపడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల లక్షలాది మంది ఢిల్లీ ప్రజలు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.

Read Also… Purandeswari: చట్ట సభలో దిగజారుడు భాష బాధాకరం.. ఏపీ అసెంబ్లీ తీరుపై పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు