Rajeev Rayala |
Updated on: Nov 23, 2021 | 2:52 PM
తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఐశ్వర్య మీనన్.. కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ
తెలుగులో కూడా ఈ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాలో మెరిసింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు.
తన క్యూట్ ఫెర్మామెన్స్‌తో తమిళ ప్రేక్షకులను, తెలుగు కుర్రాళ్ల హృదయాల్లో ప్లేస్ కొట్టేసింది ఈ చిన్నది. లవ్ ఫెయిల్యూర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఐశ్వర్యకు మాత్రం అవకాశలొచ్చి పడ్డాయి.
కన్నడ, మలయాళ చిత్రసీమల్లో కూడా చాలా సినిమాలు చేసింది ఐశ్వర్య మీనన్. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ బ్యూటీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెబుతోంది.
ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.