Marriage: ప్రసాదం ఇవ్వడానికి వెళితే పెళ్లి చేశారు.. తుపాకీ గురిపెట్టి బలవంతంగా..

Married off Forcefully: ఆ యువకుడి ఇంట్లోని కుటుంబసభ్యులు ఛత్‌పూజను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసాదం ఇచ్చేందుకు యువకుడు.. వారి బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతే

Marriage: ప్రసాదం ఇవ్వడానికి వెళితే పెళ్లి చేశారు.. తుపాకీ గురిపెట్టి బలవంతంగా..
Viral
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2021 | 5:30 PM

Married off Forcefully: ఆ యువకుడి ఇంట్లోని కుటుంబసభ్యులు ఛత్‌పూజను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసాదం ఇచ్చేందుకు యువకుడు.. వారి బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతే అతనికి దారుణ పరిస్థితి ఎదురైంది. బంధువుల ఇంటి నుంచి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిని అడ్డగించారు. అనంతరం బంధించి తలకు తుపాకీ గురి పెట్టి ఏకంగా పెళ్లి చేశారు. పారిపోవడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని ధనుకి గ్రామానికి చెందిన నితీష్‌ కుమార్‌.. ఛత్‌ పూజ అనంతరం ప్రసాదం ఇచ్చేందకు నవంబర్‌ 11న వారి వదిన వాళ్ల ఊరు సర్బాది గ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో అతను వస్తుండగా.. మార్గమధ్యంలో పరోహా గ్రామ సమీపంలో కొందరు ఆయుధాలతో అడ్డగించారు.

తుపాకీలతో తలకు గురిపెట్టి నితీష్‌ను కిడ్నాప్‌ చేశారు. అనంతరం పెళ్లి మంటపానికి తీసుకెళ్లి పెళ్లికొడుకుగా అలంకరించారు. ఈ క్రమంలో తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. తనను కొట్టినట్లు నితీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా తుపాకీతో తలకు గురిపెట్టి.. తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆరోజు రాత్రి అక్కడే ఉంచారని.. అనంతరం ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు నితీష్‌ తెలిపారు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Also Read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..