AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: సోషల్ మీడియాలో ఫొటో పెట్టిన 9 ఏళ్ల బాలుడు.. తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..

ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి నమ్మి వచ్చిన భార్యను కొడుకు ముందే రోజూ కొడుతూ ఉండేవాడు. ఇదంతా చూసిన ఆ బాలుడు తన తల్లిని తండ్రి కొడుతున్నప్పుడు ఫొటో తీసి తల్లికి విముక్తి కలిగించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Crime: సోషల్ మీడియాలో ఫొటో పెట్టిన 9 ఏళ్ల బాలుడు.. తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..
9 Year Old Son Was Upset By Teacher Father Beating Mother Every Day, Picture Of Assault Went Viral
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 28, 2021 | 4:28 PM

Share

ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి నమ్మి వచ్చిన భార్యను కొడుకు ముందే రోజూ కొడుతూ ఉండేవాడు. ఇదంతా చూసిన ఆ బాలుడు తన తల్లిని తండ్రి కొడుతున్నప్పుడు ఫొటో తీసి తల్లికి విముక్తి కలిగించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్‎లోని బధారా గ్రామానికి చెందిన ఫూల్ కుమార్ అనే వ్యక్తి దుర్గాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. జయప్రకాష్ నగర్‌లోని మిశ్రా భవన్‌లో తన భార్య, కొడుకుతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో సమస్యల కారణంగా భార్య, భర్తలు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో కుమార్ ప్రతిరోజు భార్యను కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. శనివారం రహస్యంగా వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. చేసేదేమి లేక ఆమె ఇంటి ముఖం పట్టారు.

భార్య మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసుకున్న ఫూల్ కుమార్ శనివారం రాత్రి ఆమెను చావ బాదాడు. తల్లిని ఆ స్థితిలో చూసి 9 ఏళ్ల కొడుకు మనసు కలిచివేసింది. ఏం చేయాలో పసి హృదయానికి అర్థం కాలేదు. అ పక్కనే ఉన్న అమ్మ ఫోన్‎లో తండ్రి తల్లిని కొడుతున్న ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఫొటోలు వైరలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎం డా. అలోక్ రాజన్ ఘోష్, జిల్లా ఎస్పీ అమితేష్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన్నట్లు తెలిపారు. నిందితుడిని జైలుకు పంపుతాం..భర్యను కొట్టిన నిందితుడిని అరెస్ట్ చేశామని సిటీ పోలీస్ స్టేషన్ చీఫ్ రామస్వార్థ్ పాశ్వాన్ చెప్పారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన జైలుకు పంపే ప్రక్రియ కొనసాగుతోందిని తెలిపారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Divorce Party Video: విడాకుల సందర్భంగా గ్రాండ్‌ పార్టీ.. విముక్తి లభించిందంటున్న మహిళ..(వీడియో)

 Warangal Medical College: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌..! రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు..(వీడియో)

 Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో)

 YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో)